చెల్లెలి భర్తతో మహిళ పరారీ

Women Escape With Sister Husband in Karnataka - Sakshi

కర్ణాటక, హొసూరు: నలుగురు పిల్లలకు తల్లి అయిన ఓ మహిళ చెల్లెలి భర్తతో పరారైన సంఘటన నాగరసంబట్టి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది. తట్రహళ్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ గోవిందరాజ్, అతని భార్య రమ్య(28) దంపతులకు హేమవర్షిణి(8), అంబికా(6), కోకిల(4), దినేష్‌(2) అనే పిల్లలున్నారు. కొద్ది రోజుల క్రితం రమ్య తన నలుగురు పిల్లలతో సహా అదృశ్యమైంది. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియలేదు. స్థానికుల సమాచారం మేరకు రమ్య చెల్లెలి భర్త కార్తీక్‌తో పరారైనట్లు తెలిసింది. ఈ సంఘటనపై నాగరసంబట్టి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top