యూసఫ్‌గూడలో దారుణం | Woman Killed In Hyderabad Jewellery Shop | Sakshi
Sakshi News home page

యూసఫ్‌గూడలో దారుణం

May 28 2018 6:28 PM | Updated on Sep 4 2018 5:44 PM

Woman Killed In Hyderabad Jewellery Shop - Sakshi

మృతురాలు వెంకటలక్ష్మీ

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని యూసఫ్‌గూడలో దారుణం చోటు చేసుకుంది. బంగారం కొనేందుకు జ్యువెల్లరీ షాప్‌కు వచ్చిన యువతిని గొంతుకోసిన దుండగుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో ఒక్కసారిగా యూసఫ్‌గూడలో కలకలం రేగింది.

సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. షాపులో నుంచి పెద్దగా అరుపులు వినిపించడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి వెళ్లేసరికి యువతి రక్తపు మడుగులో పడివుంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతురాలు వెంకటలక్ష్మి(19)గా గుర్తించారు. పదేళ్ల కిందట రావులపాలెం నుంచి వెంకటలక్ష్మి హైదరాబాద్‌కు వలస వచ్చినట్లు చెప్పారు. జ్యువెల్లరీ షాపులో ఎలాంటి చోరీ జరగలేదని చెప్పారు. తెలిసిన వ్యక్తే వెంకటలక్ష్మిని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నామని చెప్పారు. నిందితుడి కోసం పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement