కాంతి పుంజం..తీసింది ప్రాణం | woman dead in road accident | Sakshi
Sakshi News home page

కాంతి పుంజం..తీసింది ప్రాణం

Jan 31 2018 7:33 AM | Updated on Aug 30 2018 4:15 PM

woman dead in road accident - Sakshi

కళావతి (ఫైల్‌)

తుమకూరు: మిరిమిట్లు గొలిపే కాంతి పుంజం ఒకరి మృతికి కారణమైంది. కారు హెడ్‌లైట్ల వెలుతురులో దారి కనిపించక స్కూటీ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో మహిళ గాయపడింది. ఈఘటన సోమవారం రాత్రి తుమకూరు జిల్లా, హులియూరు సమీపంలో చోటు చేసుకుంది. హులియూరు గ్రామ పంచాయతీ సభ్యుడు ఎస్‌ఎస్‌ఆర్‌ ధయానంద్‌ భార్య కళావతి(28) సోమవారం రాత్రి తన వదిన వినూతతో కలిసి  తిపటూరు వెళ్లింది. తిరిగి వస్తుండగా  హులియూరు వద్ద కారు ఎదురైంది. హెడ్‌లైట్ల వెలుతురులో దారి కనిపించక స్కూటీ ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. ప్రమాదంలో కళావతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ వినూతకు తీవ్ర గాయాలయ్యాయి. హందనకెరె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని,  క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement