మహిళ దారుణ హత్య | Woman brutally murdered suspiciously | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Sep 25 2017 4:15 AM | Updated on Sep 25 2017 4:15 AM

Woman brutally murdered suspiciously

సాక్షి, వేంపల్లె : వేంపల్లె పట్టణంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మృతురాలి కోడలు రియానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లె పట్టణంలోని శ్రీచైతన్యనగర్‌ వీధి సమీపంలో షేక్‌ నూర్జహాన్‌(55) చిల్లర కొట్టు పెట్టుకొని వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. మృతురాలికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మస్తాన్‌వల్లి భార్య రియానా వేంపల్లెలోని పాతపేటలో నివాసం ఉంటోంది. కొడుకు జీవనోపాధి కోసం సౌదీకి వెళ్లాడు. చిన్న కొడుకు రఫి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. మృతురాలి భర్త కరీముల్లా కొన్నేళ్లుగా వేరే వివాహం చేసుకుని వేంపల్లెలోని రాజీవ్‌కాలనీలో నివాసముంటున్నాడు. వీరికి ఎప్పుడూ మనస్పర్థలు లేవు.

శుక్రవారం సాయంత్రం మృతురాలు తన తమ్ముడు షేక్‌ మాబు ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడి వచ్చింది. అదే రోజు ర్రాతి ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కొడవలితో నరికి చంపారు.  శనివారం అంతా ఆమె మృతదేహం అలాగే ఇంట్లో ఉండింది. ఆదివారం ఉదయం స్థానికులు అంగడికి వచ్చి పిలవగా.. ఎంతసేపటికి పలకకపోవడంతో తలుపు తోయడంతో నూర్జహాన్‌ హత్యకు గురై ఉండటాన్ని చూసి బంధువులకు సమాచారం అందించారు. మృతురాలి కోడలు రియానా వేంపల్లె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పులివెందుల రూరల్‌ సీఐ రామకృష్ణుడు, వేంపల్లె ఎస్‌ఐ నరేంద్రకుమార్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, ఇటీవల స్థానికులతో నూర్జహాన్‌ గొడవ పడిందని ఈ హత్యకు ఆ గొడవ కూడా కారణమై ఉండవచ్చని ఆమె కోడలు అనుమానం వ్యక్తం చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement