వితంతువును కొట్టి చంపిన ఇంటి ఓనర్‌ | Widow beaten to death by landlord on suspicion of theft In Delhi | Sakshi
Sakshi News home page

వితంతువును కొట్టి చంపిన ఇంటి ఓనర్‌

Sep 23 2019 8:36 AM | Updated on Sep 23 2019 8:36 AM

మృతురాలు మంజు గోయల్‌ - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఇంటి ఓనర్, అతని కుటుంబ సభ్యులు విచక్షణా రహితంగా కొట్టిన దెబ్బలకు 44 ఏళ్ల వితంతువు మృతి చెందింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగింది.  పోలీసుల వివరాలు ప్రకారం.... హతురాలు మంజు గోయల్‌ (44) భర్త ఏడాది కిందట మరణించాడు. ఆమె ఆరు నెలలుగా మెహ్రౌలీలోని సతీష్‌ పహ్వా అనే ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇంట్లో అద్దెకు ఒంటరిగా నివసిస్తున్నారు. రెండు రోజుల కిందట సతీష్‌ పహ్వా ఇంట్లో కొన్ని వస్తువులు, సుమారు రూ.47వేల నగదు చోరీకి గురయ్యాయి. 

ఈ దొంగతనం చేసింది మంజు గోయెలేనని అనుమానించిన సతీష్‌ పహ్వా కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఆమెపై మూకుమ్మడిగా దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. ఈ సమాచారం తెలుసుకున్న మంజు గోయల్‌ సోదరుడు ఘటనా స్థలానికి రాగా అతడిపైనా దాడి చేశారు. ఈ ఘటనపై హతురాలి సోదరుడు, స్థానికులు మెహ్రౌలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇంటి ఓనర్‌ సతీష్‌ పహ్వా (54), అతని కుమారుడు పంకజ్‌ (29)లపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement