పోలీసులకు సెహ్వాగ్‌ భార్య ఫిర్యాదు!

Virender Sehwag wife Aarti Files A Complaint Against Her Business Partners - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సతీమణి ఆర్తీ తన వ్యాపార భాగస్వాములపై శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు తెలియకుండా తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.4.5 కోట్లు రుణం తీసుకున్నారని, తన భర్త పేరును ఉపయోగించుకొని ఈ రుణం పొందినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తీసుకున్న రుణాన్ని తిరిగి సక్రమంగా చెల్లించకపోవడంతో రుణం ఇచ్చిన సంస్థ కోర్టును ఆశ్రయించిందని, దీంతో ఈ వ్యవహారం వెలుగు చూసిందని ప్రస్తావించింది.

ఇక ఆర్తీ పలువురు భాగస్వాములతో కలిసి ఎస్‌ఎమ్‌జీకే ఆగ్రో ప్రైవేట్‌ లిమిటేడ్‌ అనే సంస్థను నడిపిస్తోంది. అయితే ఈ సంస్థ పేరుపై ఆమె భాగస్వాములు వీరేంద్ర సెహ్వాగ్‌ పేరు ఉపయోగించుకొని లోక్‌న్‌ పాల్‌ బిల్డర్స్‌ అనే సంస్థ దగ్గర రూ.4.5 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ విషయం ఆర్తీ తెలియకుండా ఫోర్జరీ సంతకంతో రుణాన్ని పొందారు. అయితే రుణాన్ని సక్రమంగా చెల్లించడంతో లోకన్‌పాల్‌ బిల్డర్స్‌ సంస్థ కోర్టును ఆశ్రయించింది.  కోర్టు ఎస్‌ఎమ్‌జీకే ఆగ్రో కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు చూసి ఖంగుతిన్న ఆర్తీ.. తన సంతకం ఫోర్జరీ జరిగినట్లు తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  ఇక 2004లో వివాహ బంధంతో సెహ్వాగ్‌, ఆర్తీలు ఒక్కటవ్వగా.. వీరికి ఇద్దరు పిల్లలు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, వేదాంత్‌ సెహ్వాగ్‌ ఉ‍న్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top