వీడని వాసుదేవ్‌ హత్య మిస్టరీ

Vasudev murder mystery yet to solve - Sakshi

హైదరాబాద్‌ : మలేషియాలో వ్యాపారి వాసుదేవ్‌సింగ్‌ రాజ్‌పురోహిత్‌ను కిడ్నాపర్లే హత్య చేశారా? లేక కిడ్నాపర్ల నుంచి తప్పించుకునే యత్నంలో మృతిచెందాడా? అన్న అంశాలపై స్పష్టత రాలేదు. కిడ్నాపర్లు మలేషియాలోని కౌలాలంపూర్‌లో వాసుదేవ్‌ను బందీగా ఉంచిన విషయం తెలిసిందే. అయితే బాత్‌రూమ్‌కు వెళ్లిన వాసుదేవ్‌ వెంటిలేటర్‌ నుంచి పారిపోయేందుకు యత్నించి రెండస్థుల భవనంపై నుంచి కింద పడి మృతిచెందగా, స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు కిడ్నాపర్లే రాడ్‌తో తలపై మోది హత్య చేశారన్న భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మలేషియా వెళ్లిన కుటుంబ సభ్యులు కూడ స్పష్టత ఇవ్వకపోవడంతో అతని మృతి పలు అనుమానాలకు తావిస్తోంది.

వాసుదేవ్‌ హత్య కేసులో మలేషియా పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ప్రధాన నిందితుడు ఖాన్‌ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.  ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఖాన్‌తో కొంత కాలంగా వాసుదేవ్‌ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 1న మలేషియాలోని హోటల్‌ నుంచి ఖాన్‌ వెంట వెళ్లిన వాసుదేవ్‌ తిరిగిరాలేదు. అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో హోటల్‌కు వచ్చిన ఖాన్‌.. అతని సహచరులను వాసుదేవ్‌ ఎక్కడని ప్రశ్నించాడు. నీ వెంటనే తీసుకెళ్లావు కదా అనగా.. తాను మధ్యాహ్నమే అతన్ని వదిలివెళ్లానని సమాధానమిచ్చాడు. అనంతరం ఖాన్‌ కూడా తిరిగి కనిపించలేదు. ఈ క్రమంలో ఇదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఖాన్‌ ఫోన్‌ స్విచాఫ్‌ కావడంతో వారు విషయాన్ని హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులకు తెలిపి అక్కడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాసుదేవ్‌సింగ్‌ మృతదేహం ఆదివారం తెల్లవారుజామున ఈసీఐఎల్‌ మహేశ్‌నగర్‌లోని అతని ఇంటికి చేరింది. మధ్యాహ్నం కుషాయిగూడలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top