తీరని కడుపుకోత | Sakshi
Sakshi News home page

తీరని కడుపుకోత

Published Mon, Feb 5 2018 5:27 PM

untrained bus drivers for private school busses causing accidents - Sakshi

చిట్టిపొట్టి మాటలతో స్కూల్‌ బ్యాగులు వేసుకొని అమ్మ.. నాన్న బై.. అంటూ పాఠశాలకు బయలుదేరిన పిల్లలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారో..? లేదో..? అన్న భయం ప్రైవేట్‌ పాఠశాలలకు పంపే విద్యార్థుల తల్లిదండ్రుల్లో  నెలకొంటోంది.  కొన్నేళ్లుగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం...

సంగారెడ్డి క్రైం: సరైన శిక్షణ నైపుణ్యం కలిగిన డ్రైవర్లనే ఎంచుకొని ప్రైవేట్‌ పాఠశాలల బస్సులను నడిపేందుకు నియమించుకోవాలి. లాభపేక్షతో యాజమాన్యాలు తక్కువ వేతనంతో పని చేస్తే వారిని నియమించుకుంటున్నాయి. సరైన శిక్షణ లేని డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం మత్తులో బస్పులు నడపడం కూడా మరో కారణం. ఇటీవల సంగారెడ్డి మండలం ఫసల్‌వాది చౌరస్తా వద్ద ఓ ప్రైవేట్‌ పాఠశాల బస్సు డ్రైవర్‌ మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన సంఘటనలో హత్నూర మండలానికి చెందిన విద్యార్థులు గాయపడిన సంగతి విదితమే. కొన్నేళ్ల క్రితం జూలై 24న వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వేగేటు వద్ద పాఠశాల బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో 16 మంది విద్యార్థులు, డ్రైవర్, క్లీనర్‌ మృతి చెందగా.. మరో 18 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ సంఘటన మారుమూల ప్రాంతాల్లోని అనేక కుటుంబాల్లో చీకట్లను నింపింది. నేటికీ పాలకులు, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు గుణపాఠం నేర్చుకోలేదనే విమర్శలున్నాయి.


అధికారుల పర్యవేక్షణ లోపం
రోజురోజుకు ప్రైవేట్‌ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మౌలిక వసతులు లేకపోయినా... శిక్షణ,అర్హత లేని వారితో ఏర్పాటు చేస్తున్నారు. పరిమితికి మించి విద్యార్థులను బస్సుల్లో తరలించడం పరిపాటైంది. ఏటా రవాణా శాఖ అధికారులు పాఠశాలల ప్రారంభ సమయంలో ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలను ‘మమ’ అనిపిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల నిర్వహణపై అధికారులు పర్యవేక్షించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిట్‌నెస్‌ పరీక్షల సమయంలో మాత్రం బ్యాడ్జ్‌ నెంబర్‌ కలిగిన డ్రైవర్లతో అనుమతి పొందుతున్నారు. తర్వాత యథావిధిగా బ్యాడ్జ్‌ నెంబర్‌, అనుభవం లేనివారితో నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

1/1

మాసాయిపేట రైల్వేగేట్‌ సంఘటనలో ప్రమాదానికి గురైన ప్రైౖవేట్‌ బస్సు(ఫైల్‌) 

Advertisement

తప్పక చదవండి

Advertisement