
చికిత్స పొందుతన్న కార్తీక్ విక్రం
సాక్షి, కర్ణాటక(యశవంతపుర) : కన్నడ నటుడు కార్తిక్ విక్రంపై దుండగులు దాడి చేసి నిలువు దోపిడీ చేశారు. ఈఘటన బసవేశ్వరనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. కెహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న నటుడు కార్తీక్ విక్రం మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో స్నేహితుడిని ఇంటి వద్ద డ్రాప్ చేశాడు. తిరిగి కారులో ఇంటికి వెళ్తుండగా కిలోస్కర్ కాలనీ వద్ద ఏడుగురు దుండుగులు వాహనాన్ని అడ్డగించి ఘర్షణకు దిగారు. అనంతరం అతనిపై దాడి చేసి కారు, మొబైల్ లాక్కొని ఉడాయించారు. తర్వాత కార్తీక్ విక్రం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.