హోటల్‌లోకి దూసుకెళ్లిన లారీ, మహిళలు మృతి | Three Women killed, two injured as lorry rams into Hotel | Sakshi
Sakshi News home page

హోటల్‌లోకి దూసుకెళ్లిన లారీ, మహిళలు మృతి

Jun 29 2019 8:35 PM | Updated on Jun 29 2019 8:54 PM

Three Women killed, two injured as lorry rams into Hotel - Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామం వద్ద శనివారం విషాదం నెలకొంది. లారీ అదుపు తప్పి హోటల్‌లోకి దూసుకెళ్లిన సంఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నుంచి ఆంధ్ర వైపు వస్తున్న తౌడు లారీ చట్టి జంక్షన్ వద్ద అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్ళడంతో హోటల్‌లో కూర్చున్న ముగ్గురు మహిళలు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారినీ చింతూరు ఏరియా ఆసుపత్రి కి తరలించారు, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement