మాందారిపేట శివారులో రోడ్డు ప్రమాదం | Three Injured In Road Accident | Sakshi
Sakshi News home page

మాందారిపేట శివారులో రోడ్డు ప్రమాదం

Aug 27 2018 2:40 PM | Updated on Aug 30 2018 4:17 PM

Three Injured In Road Accident   - Sakshi

గాయాలపాలైన సరిత, కీర్తన

శాయంపేట (భూపాలపల్లి) : మండలంలోని మాందారిపేట శివారులోని గుట్టల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం రేగొండ మండలం దమ్మన్నపేటకు చెందిన నడిపెల్లి కృష్ణారావు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ హన్మకొండలో ఉంటున్నాడు. ఈ క్రమంలో పరకాలలోని ఓ శుభకార్యానికి తన భార్య సరిత, కూతురు కీర్తనలతో కలిసి వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణంలో హన్మకొండకు వెళుతుండగా మాందారిపేట శివారులో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది.

దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్‌ చేస్తున్న కృష్ణారావు సీటుబెల్ట్‌ పెట్టుకోవడంతో కారులో ఉన్న ఎయిర్‌బ్యాగ్‌ తెరుచుకుంది. దీంతో కృష్ణారావు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంటనే అతడి బంధువులు వెంటనే మరో కారులో వారిని హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై జక్కుల రాజబాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement