దుబాయ్‌ వెళ్లేందుకు రైలు ఎక్కిన బాలురు | Three Boys Missing Case Chased Bapatla Police Guntur | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ వెళ్లేందుకు రైలు ఎక్కిన బాలురు

Mar 10 2020 12:46 PM | Updated on Mar 10 2020 12:46 PM

Three Boys Missing Case Chased Bapatla Police Guntur - Sakshi

బాలురను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న సీఐ అశోక్‌కుమార్‌

అమరావతి, బాపట్ల: దుబాయ్‌ వెళ్లేందుకు ముగ్గురు బాలురు రైలు ఎక్కి బాపట్ల స్టేషన్‌లో దిగారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో బాపట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన సంజయ్, సూర్యతేజ, గోపీ దుబాయ్‌ వెళ్లేందుకు అక్కడ చెన్నై రైలు ఎక్కి బాపట్లలో దిగారు. బాపట్ల రైల్వే స్టేషన్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో సీఐ అశోక్‌కుమార్‌ వారిని విచారించారు. సంజయ్‌ తండ్రి ఆంజనేయులను పిలిపించి వారిని అప్పగించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు భాస్కర్, హజరత్తయ్య పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement