కడుపుబ్బ నవ్విస్తున్న దొంగల వీడియో.. రికార్డ్ వ్యూస్! | Thief Knocks Down another thief video goes viral | Sakshi
Sakshi News home page

కడుపుబ్బ నవ్విస్తున్న దొంగల వీడియో.. రికార్డ్ వ్యూస్!

Feb 15 2018 7:28 PM | Updated on Oct 22 2018 6:05 PM

Thief Knocks Down another thief video goes viral - Sakshi

చోరీకి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు

బీజింగ్: ఇద్దరు దొంగలు చోరీ కోసం వెళ్లి విఫలమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. చివరికి నాటకీయ పరిస్థిత్తుల్లో దొంగలు అక్కడి నుంచి బయటపడ్డారు. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు స్వయంగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. షాంఘైలో ఫిబ్రవరి 14న అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు చోరికి వెళ్లారు. మాస్కులు ధరించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న దొంగలు చోరీ యత్నం చేయకముందే తీవ్ర ఇబ్బందులపాలు కావడం నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది.

గ్లాస్ డోర్‌ పగలకొట్టేందుకు తొలుత ఓ దొంగ ఇటుకలతో కొట్టాడు. చోరీకి వచ్చిన రెండో వ్యక్తి ఇటుకను తీసుకుని గ్లాస్ డోరు వైపు బలంగా విసరగా మొదటి దొంగకి గట్టిగా తాకడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన పొరపాటు గమనించిన రెండో వ్యక్తి తన పార్ట్‌నర్‌ను అక్కడినుంచి పక్కకు తీసుకెళ్లాడు. 'ఇలాంటి దొంగలున్నంత కాలం పోలీసులు ఓవర్ టైమ్ డ్యూటీ చేయాల్సిన పనిలేదంటూ' షాంఘై పోలీసులు కామెంట్ చేస్తూ సీసీటీవీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా 24 గంటలు గడవకముందే కోటిన్నర మంది నెటిజన్లు వీక్షించారు.

రికార్డ్ వ్యూస్ వచ్చిన దొంగల వీడియో.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement