
గేట్ వద్ద నిరసన తెలియజేస్తున్నవిద్యార్థులు
బాలాజీచెరువు: జేఎన్‌టీయూకే నలంద బాయ్స్ హాస్టల్స్ విద్యార్థులు భోజనంలో పురుగులు ఉన్నాయంటూ మంగళవారం రాత్రి గేటు వద్ద నిరసన తెలియజేశారు. వారం రోజులుగా ఈ సమస్య వస్తుండగా మెస్ ఇన్‌చార్జికి తెలిపామని, సమస్యను పరిష్కరించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ నిరసన తెలియజేశారు.
దాదాపు 50 మంది విద్యార్థులు గేటు వద్ద కూర్చుని రాత్రి 11గంటల వరకూ నిరసన తెలియజేశారు. దీంతో మెస్ నిర్వాహకులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు. ఈ సమస్య కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లలేదని, బుధవారం తెలియజేసి తమ సమస్యను పరిష్కరించుకుంటామని కొంతమంది విద్యార్థులు పేర్కొన్నారు.