
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్‌రెడ్డి విడుదలయ్యారు. మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయనకు అనుమతి ఇచ్చిన కోర్టు.. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.
అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎంపీ మిథున్‌రెడ్డి పేరును ఏ4గా చేర్చింది. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికాగా.. కోర్టు ఆదేశాల మేరకు జూలై 19వ తేదీన సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం అదే రోజు రాత్రి సిట్ అరెస్ట్ చేసింది.
ఈ క్రమంలో.. కోర్టుల్లో ఉపశమనం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎంపీ పీవీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తాను ఓటేయాల్సిన అవసరం ఉందని అందులో పేరొన్నారాయన. అయితే.. మిథున్‌రెడ్డి పిటిషన్‌కు అర్హత లేదని సిట్ వాదించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపుతూ బెయిల్ కోరడం సహేతుకం కాదు అని అభిప్రాయపడింది. చివరకు కోర్టు మిథున్‌రెడ్డి తరఫు లాయర్ల వాదనకే మొగ్గు చూపిస్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.