జ్యోతిష్యం పేరుతో ఆభరణాల చోరీకి యత్నంc | Theft Attempt In Warangal | Sakshi
Sakshi News home page

జ్యోతిష్యం పేరుతో ఆభరణాల చోరీకి యత్నం

Jun 14 2018 2:38 PM | Updated on Aug 11 2018 6:04 PM

Theft Attempt In Warangal - Sakshi

టేకు జంపయ్య

దంతాలపల్లి : జ్యోతిష్యం పేరుతో మహిళ చెవుల ఆభరణాల చోరీకి యత్నిం చిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన సం ఘటన మండలం లోని బీరిశెట్టిగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

మండలంలోని దాట్ల గ్రామానికి చెందిన టేకు జంపయ్య జ్యోతిష్యం చెబుతూ గ్రామ గ్రామాన తిరుగుతూ ఉండేవాడన్నారు. ఈ క్రమంలో బుధవారం బీరిశెట్టిగూడెం గ్రామంలో తిరుగుతూ కుంబం సుజాత అనే మహిళ ఇంటికి వెళ్లాడని తెలిపారు.

బాధిత మహిళకు జ్యోతిష్యం చెబుతూ మాటల్లో పెట్టి, ఆభరణాలను రెట్టింపు చేస్తానని, తన చెవుల దుద్దులను తీసి మూటగా చేసి ఇవ్వాలని కోరాడన్నారు. జ్యోతిష్యుని మాటలను నమ్మిన మహిళ చెవుల దుద్దులను ఇవ్వగా దానిని మూటకట్టి మంచినీరు అడిగాడన్నారు.

మంచినీళ్లకు ఇంట్లోకి వెళ్లగానే పారిపోవడానికి ప్రయత్నించగా మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి పట్టుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement