
సూర్యాపేట: చింతలపాలెం మండలం పీక్లానాయక్ తండాలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీక్లానాయక్ తండాలో పాల్గొన్నారు. ఉత్తమ్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు యత్నించిన టీఆర్‌ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు.
ఈ ఘటనతో అక్కడి వాతావరణం మారిపోయింది. ప్రతీకారంగా కాంగ్రెస్ శ్రేణులపై టీఆర్‌ఎస్ వర్గ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. పరస్పర దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. విషయం తెలిసి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టి అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పారు.