
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లాలో బస్సులో ఓ ప్రయాణికుడి బ్యాగులోంచి రూ.10 లక్షల నగదు చోరీ అయింది. నార్కట్‌పల్లి శివారులో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన సంజీవరెడ్డి కారు కొనుగోలుకుగాను రూ.10.3 లక్షలను బ్యాగ్‌లో పెట్టుకుని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వెళ్తున్నాడు. సంజీవరెడ్డి ప్రయాణిస్తున్న బస్సును నార్కట్‌పల్లి శివారులోని పూజిత హోటల్ వద్ద ప్రయాణికులు టిఫిన్ చేసేందుకు డ్రైవర్ నిలిపాడు. సంజీవరెడ్డితోపాటు ఇరవై మంది ప్రయాణికులు బస్సు దిగారు. అనంతరం బస్సు ఎక్కిన సంజీవరెడ్డికి తన బ్యాగ్‌ను పరిశీలించగా రూ.30 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో బాధితుడు నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బస్సులో ఇరవై ఒక్క మంది ప్రయాణించగా నగదు చోరీకి గురైన అనంతరం 20 మంది ప్రయాణికులు మాత్రమే బస్సులో మిగిలారు. మిగిలిన ఆ ఒక్కరు ఎవరు అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.