ఆశ్రమంలోకి చొరబడి పూజారులపై దాడి

Temple Looted And Sadhus Attacked In Maharashtra Palghar - Sakshi

పాల్ఘర్‌ : మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలో సాధువులపై దాడి చేసిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లా వాసాయిలోని బలివాలి వద్ద ఉన్న జఘ్రుత్ మహాదేవ్ మందిర్ ఆశ్రమంలోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆలయం పూజారులపై దాడి చేసి రూ. 6800 విలువైన వస్తువులతో పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముగ్గురూ జాగ్రీత్ మహాదేవ్ ఆలయంలో పూజారులుగా ఉన్న శంకరానంద్ దయానంద్ సరస్వతి (54), శ్యామ్సింగ్ సోమ్సింగ్ ఠాకూర్ (60) పై దాడి చేశారు. కాగా ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు గురువారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2 వేలు రికవరీ చేశారు.మిగతా  ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా ముగ్గురు నిందితులపై ఐపీసీ 394 సెక్షన్‌తో పాటు పలు కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు విరార్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి సురేష్ వరడే తెలిపారు.

అంతకుముందు ఏప్రిల్‌ 16న చెందిన కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు సాధువులు ముంబై నుంచి సూరత్ వైపు వెళుతుండగా పాల్ఘర్‌ జిల్లాలో ఒక గుంపు వీరిని అడ్డగించింది. దొంగలేమోనన్న అనుమానంతో వారిని విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది మైనర్లతో కనీసం 133 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top