మాస్టారు నీచత్వం

Teacher Illegal Relation With Old Student in Karnataka - Sakshi

పాత విద్యార్థినితో రాసలీలలు

కర్ణాటక, మైసూరు: విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వద్దనే చదువుకున్న విద్యార్థినితో క్రామక్రీడలకు పాల్పడుతూ, సరదాగా మొబైల్‌ఫోన్‌లో ఫోటోలు తీయడం, అవి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండడం మైసూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. కామ ఉపాధ్యాయుని నీచత్వంపై జనం ఛీ కొడుతున్నారు. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని రాంపుర గ్రామంలో ఈ దాష్టీకం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. రాంపుర గ్రామంలో ఉన్న  ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాడైన సిద్దరాజు అలియాస్‌ సిద్ధరామయ్యకు ఇప్పటికే రెండు పెళ్ళిళ్లు అయ్యాయి. తన వద్ద చదువుకున్న పాత విద్యార్థిని (20)ని మభ్యపెట్టి వాంఛలు తీర్చుకునేవాడు. ఆ ఫోటోలు తీసి వాటిని యువతి వాట్సప్‌కు పంపించాడు. అవి కాస్త మరో నంబర్‌కు వెళ్ళడంతో సోమవారం గ్రామం మొత్తం కామ క్రీడల పోటోలు వైరల్‌గా మారాయి. 

కాముకుడు పరారీ 
ఈ ఘోరంపై గ్రామస్తులు ఆగ్రహంతో పాఠశాల ముందు ధర్నాకు దిగగా సిద్దరాజు గ్రామం నుంచి పరారీ అయ్యాడు. అతడు గత కొంతకాలంగా ధనుర్వాతంతో బాధపడుతున్నప్పటికీ యువతిని తరచూ ఇంటికి రప్పించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న అతని అరెస్టు చేయాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top