టెన్త్‌ చదివిన ‘డాక్టర్‌’ గుట్టు రట్టు!

Taskforce Police Caught Fake Doctor At Private Hospital In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: చదివింది పదో తరగతి. చేసేది డాక్టర్‌ వృత్తి. అదేంటీ టెన్త్‌ చదివితే డాక్టర్‌ అవ్వొచ్చా? అని ఆశ్చర్యపోకండి. మెహిదీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బయటపడిన నకిలీ డాక్టర్‌ వ్యవహారంలో ఇలాంటి ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. అసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫేక్‌ సర్టిఫికేట్‌తో డాక్టర్ అవతారం ఎత్తిన ప్రబుద్ధుడి సమాచారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అందింది. దాంతో సదరు ప్రైవేటు ఆస్పత్రిపై వెస్ట్‌జోన్‌  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడులు చేశారు. టెన్త్‌ చదివి డాక్టర్‌గా‌ చలామణి అవుతున్న ఫేక్‌ డాక్టర్‌ ముజిబ్‌, ఆస్పత్రి నిర్వాహకుడు షోహెబ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను అసిఫ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. ఫేక్‌ సర్టిఫికేట్‌ ఇచ్చిందెవరనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
(కొంపముంచిన ఓఎల్‌ఎక్స్‌ బేరం!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top