
గోల్కొండ: బైక్ కొంటానని వచ్చిన ఓ యువకుడు ట్రయల్ వేస్తానని చెప్పి బైక్‌తో ఉడాయించాడు గోల్కొండ ఇన్‌స్పెక్టర్ చంద్రశేకర్ రెడ్డి కథనం ప్రకారం... రాజేంద్రనగర్ మండలం కిస్మత్ పూర్‌కు చెందిన పృథ్వీ యాదవ్ క్యాబ్ డ్రైవర్. ఇతను తన వద్ద ఉన్న పల్సర్ బైక్‌ను అమ్మడానికి ఓఎల్‌ఎక్స్‌లో పెట్టాడు. కాగా శనివారం ఉదయం ఆ బైక్ కొంటానని ఓ యువకుడు పృథ్వీ యాదవ్‌కు ఫోన్ చేశాడు. బైక్ తీసుకుని షేక్‌పేట్ నాలా అల్‌హమ్రా కాలనీ వద్ద గల డీ మార్ట్ షోరూం వద్దకు రమ్మని ఆ యువకుడు పృథ్వీ యాదవ్‌ను ఫోన్‌లో కోరారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పృథ్వీ యాదవ్ అక్కడికి వెళ్లగా... పేపర్లు, ఇన్సూరెన్స్ అంటూ వివరాలు అడిగాడు. బైక్ తీసుకొని ట్రయల్ కొడతానని చెప్పి... మూడు ట్రయల్స్ వేశాడు. మళ్లీ ట్రయల్ వేస్తానని చెప్పి బైక్‌తో ఉడాయించాడు. పృథ్వీ యాదవ్ ఆ యువకుడికి ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(పెద్దపులి దత్తతకు రూ.5 లక్షల చెక్)