మసీదు విధ్వంసం.. కలకలం!

Sunni Mob Demolished Mosque In Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌ : ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే మసీదును కొందరు సున్నీ అతివాదులు కూల్చేయడం పాకిస్తాన్‌లో కలకలం రేపింది. సియాల్‌కోట్‌లోని అహ్మదీ సెక్టార్‌లో గురువారం వేకువజామున ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో మసీదు మూసివేసి ఉండటంతో ప్రాణనష్టం సంభవించలేదు. కానీ ఇలాంటి చర్యలు తగవంటూ ముస్లిం సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై సున్నీలు కక్షగట్టారని అందులో భాగంగానే ఈ చర్యకు పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అహ్మదీ సెక్టార్‌లో నివసించే వారిని ముస్లింలు కాదంటూ పాకిస్తాన్‌ ప్రభుత్వం 1974లోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

వివాదం ఏంటంటే.. 
గతంలో ప్రముఖ మతగురువు మిర్జా గులామ్‌ అహ్మద్‌ ఈ మసీదును సందర్శించారు. 19వ శతాబ్దంలో ఆయన మత ప్రచారారాలు నిర్వహించారు. అయితే మెజార్టీ వర్టీయులైన సున్నీలు, అహ్మదీ సెక్టార్‌ ప్రజలను ముస్లింలుగా భావించలేదు. పాక్‌లో మైనార్టీగా ఉన్న అహ్మద్‌ సెక్టార్‌ వాసులు తమను ముస్లింలుగా భావించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కారణంగా అహ్మద్‌ సెక్టార్‌లోని మసీదును నాలుగు దశాబ్దాల కిందటే మూసివేశారు. అయితే తరచుగా ఈ ప్రాంత ప్రజలపై దాడులకు పాల్పడే సున్నీ మిలిటెంట్లు మసీదు విధ్వంసకాండకు పాల్పడ్డ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top