తల్లి మందలించిందని... | Student Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందని...

Apr 3 2019 7:11 AM | Updated on Apr 3 2019 7:11 AM

Student Commits Suicide in Hyderabad - Sakshi

సాంబశివ (ఫైల్‌)

మల్కాజిగిరి: తల్లి మందలించడంతో మనస్తాపానికిలోనైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సంజీవరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విష్ణుపురి ఎక్స్‌టెన్సన్‌ కాలనీకి చెదిన భరత్‌రాజ్‌  ఉమాదేవి దంపతులకు కుమార్తె లాహిరి, కుమారుడు సాంబశివ(16)సంతానం. సాంబశివ స్ధానిక ప్రైవేట్‌ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్నాడు.

ఈ నెల 3న  చివరి పరీక్ష రాయాల్సి ఉంది. అయితే సోమవారం రాత్రి సెల్‌ఫోన్‌లో పబ్జీ గేమ్‌ ఆడుతుండగా తల్లి మందలించింది. దీంతో గదిలోకి వెళ్లిన సాంబశివ తలుపులు వేసుకుని గడియపెట్టుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత తల్లి తలుపు తట్టినా తెరవకపోవడంతో కిటికీ లోనుంచి చూడగా కిందపడి ఉన్న అతడిని గుర్తించింది. స్ధానికుల సహాయంతో గది తలుపులు తెరిచి చూడగా సాండశివ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. అతడిని స్ధానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement