స్నేహితుడు, యువతి పారిపోవడంతో.. | Student commits suicide | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Aug 9 2018 2:27 PM | Updated on Nov 9 2018 4:36 PM

Student commits suicide  - Sakshi

మహబూబ్‌నగర్‌ క్రైం : ఓ అమ్మాయి, అబ్బాయి కనిపించకపోవడంతో.. వారిద్దరి విషయమై గ్రామస్తులు చేసిన ఒత్తిడి భరించలేక ఓ యువకుడు బుధవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న రైలు కింద తల పెట్టడంతో తల, మొండెం వేర్వేరయ్యాయి. మం డలంలోని మాచన్‌పల్లికి చెందిన శ్రీకాంత్‌(17) జిల్లా కేంద్రంలోని చైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

శ్రీ కాంత్‌కు గ్రామంలో ఆటోడ్రైవర్‌గా పనిచేసే అంజి అనే స్నేహితుడు ఉన్నాడు. వారం క్రితం అంజితో పాటు అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి గ్రా మం నుంచి వెళ్లిపోయారు. అయితే, వారు ఎక్కడి కి వెళ్లారో శ్రీకాంత్‌కు తెలుసునని భావించిన గ్రామస్తులు ఆచూకీ చెప్పాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు.

అది భరించలేక శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణ తెలిపారు. కాగా, ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ  శ్రీకాంత్‌ రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీ వీడియో తీసి.. స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపించాడు. ఈ వీడియో చేసి స్పందించే లోగానే ఆయన ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.   

Advertisement
 
Advertisement
Advertisement