ఆటో డ్రైవర్‌ అతివేగం.. తల్లి ఒళ్లోనుంచి ఎగిరిపడ్డ చిన్నారి | Speeding Auto Causes Toddler Death In Kolkata | Sakshi
Sakshi News home page

అతివేగం.. ఆటోలోనుంచి ఎగిరిపడ్డ బాలుడు

Aug 8 2018 3:57 PM | Updated on Aug 8 2018 4:19 PM

Speeding Auto Causes Toddler Death In Kolkata - Sakshi

కోల్‌కతా : ఆటో డ్రైవర్‌ అతివేగం, రోడ్డు కుదుపులు ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని  బారానగర్‌కు చెందిన రింకీ సర్ధార్‌ తన ఒకటినర్ర సంవత్సరాల బాబును ఒళ్లో ఉంచుకొని ఆటోలో ప్రయాణిస్తోంది. ఆటో డ్రైవర్‌ మొదటి నుంచి వేగంగా ఆటోను నడుపుతున్నాడు. ఆటో ఏకే ముఖర్జీ రోడ్‌ దగ్గరకు రాగానే రోడ్డుపై ఉన్న గుంతను తప్పించటానికి డ్రైవర్‌ ఆటోను  వేగంగా ఒక పక్కకు తిప్పాడు.

దీంతో రింకీ సర్ధార్‌ చేతుల్లోని పసిబిడ్డ రాజ్‌దీప్‌ ఎగిరి బయటపడ్డాడు. రింకీ కూడా బాలున్ని కాపాడటానికి వేగంగా వెళుతున్న ఆటోలోనుంచి కిందకు దూకింది. అయితే కింద పడ్డ తల్లీ కొడుకులను ఆస్పత్రికి చేర్చకుండా ఆ ఆటోడ్రైవర్‌ అక్కడనుంచి వెళ్లిపోయాడు. ఇది గమనించిన కొంతమంది రోడ్డుపై పడి ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. బాలుడికి చిన్నచిన్న గాయాలు అయినప్పటికి శరీరంలోపలి భాగాలు దెబ్బతినటంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement