దొంగ మెడలో చెప్పుల దండ | slipper Pariah in the The thief neck | Sakshi
Sakshi News home page

దొంగ మెడలో చెప్పుల దండ

May 3 2018 2:07 PM | Updated on May 3 2018 2:07 PM

slipper Pariah in the The thief neck - Sakshi

దొంగ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగిస్తున్న గ్రామస్తులు  

బరంపురం (ఒరిస్సా) : గంజాం జిల్లా పురుషోత్తంపురంలో దొంగను పట్టుకొని గ్రామస్తులు చితక బాది దొంగ మెడలో చెప్పుల దండవేసి గ్రామమంతా ఊరేగించారు. పోలీసులు అందించిన సమాచా రం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

పురుషోత్తం పురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రణజూలి గ్రామంలో మంగళవారం రాత్రి ఒక ఇంటిలో చోరీకి యత్నిస్తూ గ్రామస్తులకు  ఓ దొంగ చిక్కా డు. దీంతో గ్రామస్తులు దొంగను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగను అరెస్ట్‌ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement