డేటా చోరీపై విచారణకు ఐదు ప్రత్యేక బృందాలు

SIT Forms Five Teams To Investigate IT Grids Data Breach - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్‌ వేగంగా పావులు కదుపుతోంది. ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలోని సిట్‌ బృందం గురువారం డీజీపీ కార్యాలయంలో సమావేశమైంది. కేసును అన్ని కోణాల్లో విచారణ చేపట్టడానికి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓ వైపు సాక్షుల, నిందితుల విచారణ చేపడుతూనే మరోవైపు యూజర్ల సమాచారం తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం సిట్‌ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాట చేసింది. (‘ఐటీ గ్రిడ్స్‌’పై సిట్‌)

సైబర్‌ క్రైమ్‌ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం.. ఈ కేసుకు సంబంధించి సైబర్‌ నిపుణల సలహాలతో డేటా అనాలసిస్‌, డేటా రిట్రైవ్‌ చేపట్టనుంది. ఈ కేసుకు సంబంధించి సాక్షులను, నిందితులను విచారించడానికి సీనియర్‌ అధికారితో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. మరో టీమ్‌ ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులతో సంప్రదింపులు జరపనుంది. మిగిలిన రెండు ప్రత్యేక బృందాలు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్‌ ఎండీ అశోక్‌ కోసం గాలింపు చేపట్టనున్నాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన యూజర్ల సమచారం ఇవ్వాల్సిందిగా అమెజాన్‌, గూగుల్‌ని కోరింది. డేటా చోరీకి సంబంధించి యూఐడీఎఐ, ఎన్నికల కమీషన్‌లకు లేఖ ద్వారా సిట్‌ సమాచారం అందజేయనుంది.(ఇదీ జరుగుతోంది!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top