Stephen Raveendra
-
సిక్ చౌహానీలో సిక్కు కమ్యూనిటీతో సీపీ స్టీఫెన్ సమావేశం
-
స్టీఫెన్ రవీంద్రకు పితృవియోగం
హైదరాబాద్: గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తండ్రి ముత్యాల బెంజమిన్ రంజిత్(81) బుధవారం సాయంత్రం ఏఐజీ హాస్పిటల్లో మరణించారు. గతంలో బెంజమిన్ రంజిత్ పోలీసు శాఖలో ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. బెంజమిన్ రంజిత్ మృతి పట్ల డీజీపీ అంజనీకుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 1998లో తాను గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో రంజిత్‌తో కలిసి పనిచేశానని, వృత్తిలో నిబద్ధత కలిగిన వ్యక్తి చనిపోవడం అత్యంత బాధాకరమని డీజీపీ వ్యాఖ్యానించారు. బెంజమిన్ రంజిత్ అంత్యక్రియలను శుక్రవారం మధ్యాహ్నం నారాయణగూడలోని ప్రొటెస్టంట్ సిమెట్రీలో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
HYD: ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ప్లాన్.. కార్ పూలింగ్ విధానం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది. ఐటీ ఉద్యోగులు వరుసుగా ఆఫీసులకు రావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. కాగా, ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా కార్ పూలింగ్ విధానం అమలు చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశమయ్యారు. టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, జేపీ మోర్గాన్, విప్రో, ఐసిఐసిఐ, హెచ్ఎస్బీసీతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఐటీ కారిడార్‌లో కార్ పూలింగ్ విధానంపై వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఐటీ కంపెనీలు సొంత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా పోలీసులు మరో ప్రతిపాదన చేశారు. ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా పనివేళల్లో మార్పులపై సూచనలు తెలియజేశారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పరిశీలించాలని కూడా పోలీసులు కోరారు. కార్ పూలింగ్ విధానం.. ఒకరి కంటే ఎక్కువ మంది కారు వినియోగించుకుంటే ట్రాఫిక్ కొంత వరకు తగ్గుతుంది. కాలుష్యం కూడా ఆదుపులో ఉంటుంది. దీనిపైనే ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. చాలా మంది ఉద్యోగులు సొంత కార్లలోనే ప్రయాణం చేస్తున్నారు. కేవలం ఒకరి కోసం కూడా కారును బయటకు తీస్తున్నారు. వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లలో దాదాపు 75 శాతం వరకు ఒకరిద్దరు మాత్రమే ఉంటున్నారు. దీంతో కారు పూలింగ్ విధానంతో సమస్యకు చెక్ పెట్టవచ్చన్నది ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. ఈ విధానం ఎక్కువగా విదేశాల్లో అమలవుతోంది. హైటెక్‌సిటీలో కారు పూలింగ్ చేపడితే సగానికి సగం సమస్య తీరినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు! -
HYD: డేటా చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఈడీ ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: డేటా చోరీ కేసు తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. ఈ కేసులో సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, అంతకుముందు.. దేశంలోనే అతి పెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రజల వ్యక్తిగత డేటాను విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మంది డేటా చోరీ అయినట్లు గుర్తించారు. మరో 10 కోట్ల మంది డేటా చోరీ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వెంటనే ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. డేటా చోరికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరించారు. డేటా చోరీ కేసు దర్యాప్తులో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ రోజు మీడియాకు వెల్లడించారు. డేటా చోరి స్కామ్‌లో పలు బ్యాంకుల క్రెడిట్ కార్డు జారీ చేసే ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించామన్నారు. దేశంలోని కోట్ల మంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. పలు కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని వెల్లడించారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా కూడా చోరీకి గురైందని తేల్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే 7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘దిశ’ కేసులో వాయిదాలు సరికాదు -
16.8 కోట్ల మంది డేటా చోరీ!
గచ్చిబౌలి: వందలు.. వేలు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం చోరీకి గురైంది. రక్షణ శాఖ సహా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన లక్షలాది మంది ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల డేటా అంగడి సరుకుగా మారింది. మహిళలు, వృద్ధులు, విద్యార్థుల వివరాలూ కేటుగాళ్లకు చేరాయి. పాన్, ఫోన్ నంబర్లు, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల వివరాలు క్రిమినల్స్ పరమయ్యాయి. దేశ భద్రతకు ముప్పు కలిగించే స్థాయిలో డేటా చోరీకి పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును సైబర్‌క్రైం పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని దొంగిలించి విక్రయిస్తున్న కేటుగాళ్ల ఆటకట్టించారు. ఢిల్లీ శివార్లలోని నోయిడా కేంద్రంగా ఈ దందా సాగిస్తున్న ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు. గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు. రక్షణ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, నీట్ విద్యార్థులు, డీమ్యాట్ ఖాతాదారులు, ఐటీ సంస్థల ఉద్యోగులు, వాట్సాప్, ఫేస్బుక్ వినియోగదారులు, టెలికం, ఫార్మా కంపెనీలు, సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల డేటా సహా మొత్తం 140 కేటగిరీలకు చెందిన సమాచారాన్ని నిందితులు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రక్షణ శాఖకు చెందిన (డిఫెన్స్ ఫోర్స్ ఢిల్లీ ఎన్సీఆర్ డేటాబేస్)కు చెందిన 2.55 లక్షల మంది డేటా సైతం చోరీకి గురికావడంతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డేటా చోరీలో జస్ట్ డయల్ అనే సెర్చ్ ఇంజన్ పాత్ర ఉందని, ఈ కేసులో ఆ సంస్థ వారినీ విచారిస్తామని ఆయన పేర్కొన్నారు. నిందితులు వీరే... యూపీ పరిధిలోకి వచ్చే నోయిడాలో డేటా మార్ట్ ఇన్ఫోటెక్, గోబల్ డేటా ఆర్ట్స్, ఎంఎస్ డిజిటల్ గ్రో అనే కంపెనీల (కాల్‌సెంటర్లు) ద్వారా నిందితులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఏ1 కుమార్ నితీష్ భూషణ్‌తోపాటు టెలికాలర్ కుమారి పూజ, డేటా ఎంట్రీ ఆపరేటర్ సుశీల్ తోమర్, క్రెడిట్ కార్డుల డేటా విక్రయించే అతుల్ సింగ్, ఎంఎస్ గ్రో కంపెనీలో సేకరించిన డేటాను విక్రయించే ముస్కాన్ హసన్, గ్లోబల్ డేటాఆర్ట్స్‌లో జస్ట్ డయల్ ద్వారా డేటాను విక్రయించే సందీప్ పాల్, బల్క్ మెసేజ్‌లు పంపే జియా ఉర్ రెహమాన్లను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 సెల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 2 సీపీయూలు, 140 కేటగిరీలలో డేటా చోరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా కార్యాలయాల్లో ప్రజల పాన్, మొబైల్, టెలికం, ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ, పెట్రోలియం కంపెనీలు, బ్యాంకుల డేటా, వాట్సాప్, ఫేస్బుక్ యూజర్ల డేటాను పోలీసులు కనుగోన్నారు. నిందితులు ఇప్పటివరకు సుమారు 100 మంది సైబర్ క్రిమినల్స్‌కు డేటాను విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అలాగే 50 వేల మంది పౌరులకు చెందిన సమాచారాన్ని కేవలం రూ. 2 వేలకు విక్రయించినట్లు గుర్తించామన్నారు. డేటా చోరీపై సైబర్‌క్రైం పోలీసులకు అందిన పలు ఫిర్యాదుల ఆధారంగానే దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నామన్నారు. భారీగా డేటా చోరీ... నిందితులు చోరీ చేసిన డేటాలో 1.47 కోట్ల కార్ల యజమానుల, డొమైన్ వాయిస్ డేటాబేస్ 3.47 కోట్లు, మొబైల్ నంబర్ల డేటాబేస్ 3 కోట్లు, స్టూడెంట్ డేటాబేస్ 2 కోట్లు, వాట్సాప్ యూజర్లు 1.2 కోట్ల మంది డేటా చోరీ గురైంది. అలాగే జాబ్ సీకర్స్ డేటాబేస్ 40 లక్షలు, సీబీఎస్ఈ 12వ తరగతికి చెందిన 12 లక్షల మంది విదార్థులు, సివిల్ ఇంజనీర్ల వివరాలు 2.3 లక్షలు, డెబిట్ కార్డుల సమాచారం 8.1 లక్షలు, సీనియర్ సిటిజన్స్ 10.6 లక్షలు, వెబ్సైట్ ఓనర్స్ 17.4 లక్షలు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ డేటా చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. గుర్తించిన అంశాలు... ► పలు ఆర్థిక సంస్థలు, సోషల్ మీడియా, జస్ట్ డయల్ వంటి సంస్థలు ప్రజల అనుమతి లేకుండానే డేటాను సేకరిస్తున్నాయి. ► ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో సేవలందించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, వ్యక్తుల ద్వారా డేటా చోరీకి గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ► గోప్యంగా ఉంచాల్సిన డేటా భద్రంగా ఉందోలేదో సర్వీసు ప్రొవైడర్లు తనిఖీ చేయట్లేదని తేలింది. ► జస్ట్ డయల్ లాంటి సంస్థల్లో డేటా విక్రయానికి అందుబాటులో ఉంది. పోలీసుల సూచనలు... ► మీ డేటాను ప్రైవేటు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. ► క్రెడిట్ కార్డులు, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులకు, సంస్థలకు చెప్పొద్దు. ► మొబైల్, కంప్యూటర్, యాప్‌లు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కేసు దర్యాప్తు సిట్‌కు బదిలీ దేశ భద్రతకు సంబంధించిన సమాచారం ముడిపడి ఉన్నందున డేటా చోరీ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్లు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇందుకోసం డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ నేతృత్వంలో ‘సిట్’ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ టీమ్‌లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ రితిరాజ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర అధికారులు ఉంటారని తెలిపారు. క్రెడిట్ కార్డుదారుల డేటా చోరీ ముఠా అరెస్ట్ గచ్చిబౌలి: బ్యాంకుల్లో డేటా చోరీ చేసే ముఠాను సైబర్‌క్రైం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. క్రెడిట్ కార్డుల వెరిఫికేషన్ చేస్తున్న థర్డ్ పార్టీకి చెందిన సిబ్బంది డేటాను చోరీ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన 1,780 మంది కస్టమర్ల డేటాతోపాటు ఎస్బీఐకి చెందిన 140 మంది కస్టమర్ల డేటా చోరీకి గురైందన్నారు. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో ప్రధాన నిందితుడు కఫిన్ అహ్మద్, మహ్మద్ సమాల్, మహ్మద్ అసీఫ్, చిరాగ్, విరేంద్ర సింగ్, ప్రదీప్ వాలియా, ఆకాశ్‌నిర్వాన్, విరాట్ పురి, అతీత్ దాస్‌లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 13 సెల్పోన్లు, ల్యాప్‌టాప్, క్రెడిట్ కార్డుల డేటా స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్: డేటా చోరీ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ వ్యవహారంగా సైబరాబాద్ పోలీసులు భావిస్తున్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా ఈ కేసును సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. ఐపీఎస్ అధికారి పర్యవేక్షణతో సిట్ దర్యాప్తు ముందుకు సాగనున్నట్లు తెలిపారాయన. ఇక కేసులో కీలకంగా ఉన్న జస్ట్ డయల్‌కు నోటీసులు జారీ చేయడంతో పాటు విచారించనున్నట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. సుమారు 16 కోట్ల 80 లక్షల మంది డేటా చోరీ జరిగిందని చెబుతోంది సైబరాబాద్ పోలీస్ విభాగం. మరో పది కోట్ల మంది డేటా కొట్టేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. వక్తిగత వివరాలతో పాటు అంత్యంత గోప్యంగా ఉండాల్సిన వివరాలు, సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లాయని, కేసులో లీడ్స్ ఉన్నాయని, ఎక్కడి నుంచి లీక్ అయ్యిందనే దర్యాప్తులో తేలాల్సి ఉందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. అలాగే.. ఆర్మీకి సంబంధించిన డేటా(సిబ్బంది పేర్లు, ర్యాంకులు, పోస్టింగ్ ఇతర వివరాలు) సైతం లీక్ అయ్యిందని చెప్పారాయన. సాధారణ పౌరుల నుంచి ఎవరైనా కానీ.. డేటా తీసుకున్నప్పుడు సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉంచాల్సిన బాధ్యత ఉందని సీపీ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. -
HYD: అతిపెద్ద సైబర్ స్కాం గుట్టురట్టు.. ఇన్సూరెన్స్, క్రెడిట్‌కార్డు, లోన్ డేటా..
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ స్కామ్‌ను బయటపెట్టారు. దేశంలో కోట్లాది మంది పర్సనల్ డేటాను అమ్మకానికి పెట్టిన సైబర్ దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా 16 కోట్ల మంది దేశపౌరుల డేటా అమ్మకానికి గురైనట్టు వివరించారు. వివరాల ప్రకారం.. డేటాను చోరీ చేస్తూ అమ్ముతున్న సైబర్ కేటుగాళ్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. డేటా దొంగతనంపై హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కాగా, వీరిని ఢిల్లీ, నాగపూర్, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా కూడా చోరీ అయ్యింది. దేశ భద్రతకు భంగం కలిగేలా సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు. బీమా, లోన్లకు అప్లై చేసిన నాలుగు లక్షల మంది డేటా చోరీకి గురైంది. కోట్లాదిగా సోషల్ మీడియా ఐడీలు, పాస్వర్డ్లు కూడా లీకయ్యాయి. ఆర్మీకి చెందిన రెండున్నర లక్షల మంది డేటా, ఢిల్లీలో 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల డేటా చోరీకి గురైంది. ఈ ముఠా సభ్యులు ఇన్సూరెన్స్, క్రెడిట్‌కార్డులు, లోన్ అప్లికేషన్ల నుంచి వివరాల సేకరిస్తున్నారు. డేటా చోరీ గ్యాంగ్‌లకు ఆయా కంపెనీల్లో కొందరు ఉద్యోగులు సాయం చేస్తున్నారు. సెక్యూరిటీ ఉందనుకున్న బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. సేకరించిన వ్యక్తిగత డేటాను అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు ముఠాలను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇది కూడా చదవండి: గుట్టుగా అబార్షన్ల దందా! రూ.30వేలు ఇస్తే లింగ నిర్ధారణ పరీక్ష -
హాస్టళ్లలో భద్రత కట్టుదిట్టం చేయాలి
గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో కొనసాగుతున్న వర్కింగ్ పీజీ హాస్టళ్లలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హాస్టళ్ల నిర్వాహకులు, పోలీసులకు సూచించారు. శనివారం గచ్చిబౌలిలోని టీసీఎస్ క్యాంపస్‌లో నిర్వహించిన ‘ప్రాజెక్ట్ సేఫ్ స్టే’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీ హాస్టల్స్‌లో ఉంటున్న వారికి భద్రత కల్పించడం నిర్వాహకుల బాధ్యత అన్నారు. 24 గంటలు పని చేసేలా హాస్టల్ ఎగ్జిట్, ఎంట్రీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. కాంపౌండ్ వాల్ ఐదు అడుగులు ఉండాలని, వాచ్మెన్లను నియమించాలన్నారు. విజిటర్స్ వివరాలపై రిజిస్టర్ నమోదు చేయాలన్నారు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించాలని, నోటీసు బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సజేషన్స్ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, వ్యక్తిగత లాకర్ల సదుపాయం ఉండాలన్నారు. స్టాఫ్ ఐడీ ప్రూఫ్‌లతో పాటు కొత్తగా వచ్చే వారి ఐడీ ప్రూఫ్‌లు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.ఐదు వేల జరిమానా లేదా సీజ్ చేస్తామన్నారు. అనంతరం ప్రాజెక్ట్ సేఫ్ స్టే పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీలు కవిత, శిల్పవల్లీ, ఎస్సీఎస్సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, మహిళా ఫోరం జాయింట్ సెక్రటరీ ప్రత్యూష, ట్రాఫిక్ ఫోరం కార్యదర్శి శ్రీనివాస్, ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి.అమరనాథ్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి కరుణాకర్, కోశాధికారి రఘు నాయుడు, గౌరవ అధ్యక్షులు చంద్ర శేఖర్, సంజయ్ చౌదరీ పాల్గొన్నారు. -
వచ్చేస్తున్నారు.. సైబర్ కమాండోలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు కమాండోలు అంటే మనకు తెలిసిందే. ప్రత్యేక ఆపరేషన్ల కోసం శిక్షణ పొంది రెప్పపాటులో శత్రు శ్రేణులపై దాడి చేస్తారు. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలో సైబర్ కమాండోలు రంగంలోకి దిగనున్నారు. రోజుకో సవాల్ విసురుతున్న సైబర్ నేరస్తుల ఆటకట్టించేందుకు ఇప్పటికే శిక్షణ పొందారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడు డివిజన్లు, 14 విభాగాలుగా ఏర్పాటైన ఈ బ్యూరో మరో రెండు నెలల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధమైంది. కమిషనరేట్‌లో ఠాణా, జిల్లాలో సైబర్ సెల్స్.. రాష్ట్రంలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలు, విధివిధానాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సైబర్ నేరాలను కూకటివేళ్లతో సహా పెకిలించేలా క్షేత్రస్థాయి నుంచే సైబర్ నేరాలను నివారించేందుకు ఈ బ్యూరో పనిచేయనుంది. ఈ బ్యూరోలో ప్రధానంగా మూడు డివిజన్లు, 14 విభాగాలుంటాయి. ప్రధాన కార్యాలయం సైబరా బాద్ కమిషనరేట్‌లో ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లలో ప్రత్యేకంగా సైబర్ పోలీసుస్టేషన్ ఉంటుంది. మిగిలిన జిల్లాలలో సైబర్ కో–ఆర్డినేట్ సెల్స్ ఉంటాయి. స్థానిక పోలీసుల సహకారంతో సైబర్ నేరాల నివారణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు విధులు నిర్వర్తిస్తారు. అధికారులకు విధుల కేటాయింపు.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 454 మంది అధికారులను కేటాయించింది. ఆయా పోలీసులు హ్యాకింగ్, ఫిషింగ్, సైబర్ భద్రతపై శిక్షణ పూర్తి చేసుకొని సైబర్ కమాండోలుగా సిద్ధమయ్యారు. 140 మంది వారియర్లు సైబరాబాద్ కమిషనరేట్‌లోని ప్రధాన కార్యాల యంలో, మిగిలిన 314 మంది ఇతర కమిషనరేట్లు, జిల్లా కేంద్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. సైబర్ సెక్యూరిటీబ్యూరో ప్రధాన విధులివే.. ►సైబర్ నేరాలకు పాల్పడేవారిని గుర్తించడం, ఆయా రాష్ట్రాల సహకారంతో పట్టుకోవడం ►బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికం ఆపరేటర్ల నోడల్ ఏజెన్సీలతో ఎప్పటి కప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేర గాళ్లు కొల్లగొట్టిన డబ్బును స్తంభింప జేయడం. ►నకిలీ బ్యాంకు ఖాతాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉన్న ఫోన్ నంబర్లను గుర్తించి నియంత్రించడం. ►పలుమార్లు నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నిందితులను గుర్తించి పీడీ యాక్ట్‌లు నమోదు చేయడం. అంతర్రాష్ట్ర నిందితుల ఆటకట్టు రాజస్తాన్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు సైబర్‌నేరాలకు అడ్డాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో అంతర్రాష్ట్ర నేరస్తు లను పట్టుకొనేందుకు వెళ్లిన రాష్ట్ర పోలీసులకు అక్కడి పోలీసులు సహకరించకపోవడం, నేరస్తు లు పోలీసులపై కాల్పులు, దాడులు జరపడం కూడా జరిగాయి. ఈ తరహా ఆటంకాలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిష్కారమార్గాలను కను గొంది. ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) వంటి సంస్థల సమన్వయంతో ఈ బ్యూరో పనిచేయనుంది. -
29 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలాకాలం తర్వాత భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఒకేసారి 29 మంది సీనియర్ అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేయడంతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యురిటీ బ్యూరోలకు అధికారులను నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌కు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అడిషనల్ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. బదిలీలు ఇలా.. ► అదనపు డీజీ ఆర్గనైజేషన్స్‌గా ఉన్న అదనపు డీజీ రాజీవ్రతన్ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. ► అడిషనల్ డీజీ రైల్వేస్ రోడ్ సేఫ్టీగా ఉన్న సందీప్ శాండిల్యను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ► గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని అదనపు డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ చేశారు. ► అదనపు డీజీ పర్సానెల్గా ఉన్న బి.శివధర్‌రెడ్డి రైల్వేస్, రోడ్ సేఫ్టీ అదనపు డీజీగా బదిలీ అయ్యారు. ► టీఎస్ఎస్పీ అదనపు డీజీగా ఉన్న అభిలాష బిస్త్‌ను అదనపు డీజీ వెల్ఫేర్, స్పోర్ట్స్‌గా బదిలీ చేశారు. అదేవిధంగా హోంగార్డ్స్ అదనపు డీజీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ► ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న షికా గోయల్‌ను అదనపు డీజీ ఉమెన్ సేఫ్టీ, షీటీమ్స్, భరోసా సెంటర్స్‌గా బదిలీ చేశారు. ►టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావుకు అదనపు డీజీ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ► ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జి స్వాతిలక్రాను టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా బదిలీ చేశారు. ► పోస్టింగ్ కోసం వెయింటింగ్‌లో ఉన్న విజయ్‌కుమార్‌ను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీగా బదిలీ చేశారు. ► నార్త్‌జోన్ అదనపు డీజీగా ఉన్న వై.నాగిరెడ్డిని తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేశారు. ►పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న విక్రమ్ మాన్సింగ్ను హైదరాబాద్ సిటీ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌గా నియమించారు. ► రాచకొండ అదనపు కమిషనర్‌గా ఉన్న జి.సుదీర్‌బాబును హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అదనపు సీపీగా బదిలీ చేశారు. ► మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న షాహ్నవాజ్ ఖాసీంకు మల్టీజోన్ –2 ఐజీగా బాధ్యతలు అప్పగించారు. ► వెయిటింగ్లో ఉన్న తరుణ్ జోషిని ఐజీ ట్రైనింగ్స్గా నియమించారు. ► వెయిటింగ్లో ఉన్న వీబీ కమలాసన్‌రెడ్డికి ఐజీ పర్సానెల్గా బాధ్యతలు అప్పగించారు. ► రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిని మల్టీజోన్–1 ఐజీగా బదిలీ చేశారు. ► హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీగా ఉన్న ఎం.రమేశ్‌ను డీఐజీ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్‌గా బదిలీ చేశారు. ► హైదరాబాద్ జాయింట్ సీపీగా ఉన్న కార్తికేయను డీఐజీ ఇంటిలిజెన్స్‌గా నియమించారు. ► తెలంగాణ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ కె.రమేశ్‌నాయుడును రాజన్న జోన్ డీఐజీగా బదిలీ చేశారు. ► సీఐడీ డీఐజీగా ఉన్న ఎం.శ్రీనివాసులును హైదరాబాద్ సిటీ సీఏఆర్ జాయింట్ సీపీగా బదిలీ చేశారు. ► వెయిటింగ్లో ఉన్న తఫ్సీర్ ఇక్బాల్‌ను డీఐజీ ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు బదిలీ చేశారు. ► హైదరాబాద్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న డా.గజరావు భూపాల్‌ను రాచకొండ జాయింట్ సీపీగా నియమించారు. ► నల్లగొండ ఎస్పీగా ఉన్న రెమా రాజేశ్వరిని యాదాద్రి జోన్ డీఐజీగా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నల్లగొండ ఎస్పీగా కూడా కొనసాగుతారు. ► వెయిటింగ్లో ఉన్న ఎల్ఎస్ చౌహాన్‌ను జోగుళాంబ జోన్ డీఐజీగా ఎస్పీ ర్యాంకులో నియమించారు. ► వెయిటింగ్లో ఉన్న కె.నారాయణ్ నాయక్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా నియమించారు. ► సీఐడీలో ఎస్పీగా ఉన్న జె.పరిమళ హన నూతన్‌ను హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ అడ్మిన్‌గా బదిలీ చేశారు. ► వెయిటింగ్లో ఉన్న ఆర్.భాస్కరన్‌ను కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఎస్పీగా నియమించారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారం తో దాడి
-
తక్కువ వయసు వారిని పబ్ లకు అనుమతించొద్దు : హైదరాబాద్ సీపీ
-
స్టీఫెన్ రవీంద్రకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు అరెస్టు చేసిన రాఘవేంద్రరాజు, అమరేంద్రరాజు, రవి, మధుసూదన్ లు హత్యాయత్నం అనేది బూటకమని పేర్కొంటూ లోయర్‌కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయమని కోరుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పేట్ బషీరాబాద్ సీఐ ఎస్.రమేశ్ హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. లోయర్‌కోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చారు. విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేశారు. -
సైబరాబాద్: ఖాకీలపై మూడో కన్ను
సాక్షిహైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసుల పనితీరుపై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. దీర్ఘకాలికంగా ఒకే చోట పోస్టింగ్‌లో ఉన్న ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల (ఎస్ఐ)లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే, అక్రమాలకు పాల్పడే పోలీసులను ఏమాత్రం ఉపేక్షించేదిలేదని స్పష్టంచేస్తున్నారు. అంతర్గత విచారణ జరిపించి, ఆరోపణలు నిజమని తేలితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీపీగా స్టీఫెన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకేసారి 126 మంది ఎస్ఐలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 19 మంది మహిళా ఎస్ఐలు కూడా ఉన్నారు. రెండేళ్లు పైబడితే బదిలీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ జోన్లలో మొత్తం 36 శాంతి భద్రతల ఠాణాలున్నాయి. ఒకే పీఎస్‌లో రెండేళ్లకు మించి పోస్టింగ్‌లో ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలను బదిలీ చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలోనే పోలీసు అధికారుల పనితీరు, సమర్థతను బట్టి పోస్టింగ్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. తాజాగా శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్ల నుంచి ఒక్కొక్కరు, బాలానగర్ జోన్లో ఇద్దరు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. పేట్‌బషీరాబాద్ ఇన్స్పెక్టర్ ఎస్ రమేష్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో వెయిటింగ్లో ఉన్న ప్రశాంత్‌ను, జీడిమెట్ల ఇన్స్పెక్టర్గా ఉన్న బాలరాజు స్థానంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ పవన్‌లను బదిలీ చేశారు. గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ బాలకృష్ణను బదిలీ చేసి, ఆయన స్థానంలో షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ సునీత, రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్యను సీసీఎస్‌కు బదిలీ చేసి, ఆయన స్థానంలో ఏసీబీ నాగేంద్రబాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎస్బీ నివేదికల ఆధారంగా.. పోలీసుల పనితీరుపై స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలో వారి పనితీరు, అక్రమాలపై కూపీలాగుతూ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. ఎస్బీ అధికారులకు ఇచ్చే నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు రుజువైన పోలీసులపై చర్యలతో పాటు భవిష్యత్తులో వారికి పదోన్నతి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం గతంలో నార్సింగి పోలీస్ స్టేషన్లో పనిచేసిన ముగ్గురు ఎస్ఐలను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆకస్మికంగా బదిలీ చేశారు. గతంలో నార్సింగి ఇన్స్పెక్టర్గా పనిచేసిన గంగాధర్ స్థానికంగా భూ లావాదేవీలలో తలదూర్చి అక్రమార్కులకు వంత పాడిన ఆరోపణల నేపథ్యంలో గంగాధర్‌తో పాటు ఎస్ఐ లక్ష్మణ్‌లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో రాములు (ప్రస్తుతం రాజేందర్ పీఎస్) బలరాం నాయక్ (నార్సింగి పోలీస్ స్టేషన్), అన్వేష్ రెడ్డి (ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లు సహకరించారని, అంతర్గత విచారణలో నిజమని తేలడంతో రెండేళ్ల తర్వాత వారిపై వేటు వేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
కరోనా పరీక్షలు చేశాకే లోపలికి!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యే అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, నెగెటివ్ వస్తేనే లోపలికి అను మతిస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. భేటీకి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో వీఐపీలు వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై స్టీఫెన్ రవీంద్ర గురువారం సమీక్షించారు. కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెచ్ఐసీసీ ప్రాంగణం వద్ద ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. భేటీ కోసం బీజేపీ జారీ చేసిన పాస్‌లను తీసుకురావాలని, పోలీసులు వాటిని పరిశీలించాకే లోపలికి వెళ్లనిస్తారని స్పష్టం చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ వస్తే.. పాస్ ఉన్నా కూడా లోనికి అనుమతించబోమని తెలిపారు. ఇది బీజేపీ అంతర్గత సమావేశం కావడంతో పరిమిత స్థాయిలో నేతలకు అనుమతి ఉంటుం దని.. ఇతర నేతలు, కార్యకర్తలు, జన సందోహం రావొద్దని సూచించారు. హెచ్ఐసీసీలో నాలుగం చెల భద్రత, వీఐపీలు వచ్చే రోడ్ల వెంట మూడం చెల భద్రత ఉంటుందన్నారు. ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరగకుండా శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పోలీసు పహారాలోకి హోటల్, సభా ప్రాంగణం భేటీ జరిగే హెచ్ఐసీసీ, అతిథులు బసచేసే నోవాటెల్ హోటల్‌ను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్, జిల్లాలు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, బెటాలియన్ పోలీసులు కలిపి ఆరు వేల మందికిపైగా పహారా కాయనున్నారు. ఇక ప్రధాని, వీవీఐపీల భద్రత కోసం సుమారు 300 మంది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది మోహరించనున్నారు. ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా 1,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటన్నింటినీ తాత్కాలిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. -
హైదరాబాద్: పబ్బుల్లో ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో ఓ మైనర్ బాలిక డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కూకట్‌పల్లిలోని క్లబ్ మస్తీ రెస్టో బార్ అండ్ పబ్‌పై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి.. అశ్లీల నృత్యాలు చేస్తున్న 9 మంది యువతులతో పాటు మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇలా అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలకు మారిపోయిన పబ్‌లపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక నిఘా పెట్టారు. పబ్‌లలో మద్యం, ధూమపానం, కస్టమర్లను ఆకర్షించేందు కు మహిళలతో నృత్యాలను నియంత్రించని, నిబ ంధనలు పాటించని యజమానులపై చర్యలు తీసుకోనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని పబ్‌లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్‌లు, గెస్ట్ హౌస్‌లు, ఓయో రూమ్స్‌లపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఆయా ప్రాంతాలలో పగలు, రాత్రి వేర్వేరు సమయాల్లో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనుమానం వస్తే వెంటనే తనిఖీలు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 800 మంది నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలో అందులో వివరించారు. వీటిని అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటన్నింటినీ కలిపి ఒకటే గ్రూప్‌లోకి తీసుకొచ్చారు. పబ్బుల్లో ఏం జరుగుతోంది? ఎవరు బుకింగ్ చేసుకుంటున్నారు? వేడుకలు, ఈవెంట్లు, పార్టీలకు సంబంధించిన వివరాలు, ఎంత మంది హాజరవుతున్నారనే వివరాలు పోలీసులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. అనుమానం ఉంటే వెంటనే తనిఖీలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. సత్ప్రవర్తనకు బాండ్ పేపర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారితో సీపీ కార్యాలయంలో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కొంతమంది పాత నేరస్తులు హత్యలు తదితర కేసులలో ఉన్నటువంటి వారు సత్ప్రవర్తనతో మెలగడానికి, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉండేందుకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. ఇద్దరు జామీనుదారులతో పాటు, రూ.50 వేల హామీ బాండ్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అతిక్రమించిన వారిపై సెక్షన్ 107/122 సీఆర్పీసీ ప్రకారం ఏడాది జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. సమావేశంలో క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ శింగేనవర్, ఏసీపీ రవిచంద్ర పాల్గొన్నారు. -
Hyderabad: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు
పిల్లలు జాగ్రత్త అని చీటీ రాసి.. బతుకుదెరువు కోసం కర్నూలు నుంచి హైదరాబాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి 8 ఏళ్ల కిందట వచ్చిన చాకలి రాజు.. పుప్పాలగూడలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి వద్ద చిట్టీలు వేయడం, అప్పులు చేయడం చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనికి రూ.1.5 లక్షలు ఇవ్వాల్సి ఉంది. వాటి గురించి ఒత్తిడి పెరగడంతో ఇటీవల తన స్కూటీని భార్య పనిచేసే గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డుకు ఇచ్చి స్కూటీ డిక్కీలో ‘పిల్లలు జాగ్రత్త’ అని చీటీ రాసి అదృశ్యమయ్యాడు. రెండు ఇళ్లల్లో గొడవపడి.. హైదరాబాద్‌లోని వసంతనగర్‌కు చెందిన పొక్కలపాటి సురేశ్ వర్మ ప్రైవేట్ ఉద్యోగి. నైట్ డ్యూటీ ఉందని చెప్పి గతేడాది డిసెంబర్లో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతని భార్య వర్మ బావ ప్రసాద్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. తెలిసిన వ్యక్తులు, ప్రాంతాల్లో వెతికే పనిలో ఉండగా.. డిసెంబర్ 24న గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి ఓ మహిళ ప్రసాద్‌కు ఫోన్ చేసి మీ బామ్మర్ది, నేను ఐదేళ్లుగా కలిసి ఉంటున్నామని, రెండేళ్ల క్రితం వివాహం కూడా చేసుకున్నామని చెప్పింది. శాతవాహన నగర్ కాలనీలో నివాసముంటున్న తనతో గొడవపడి బైక్, ఫోన్ ఇక్కడే వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిపింది. –సాక్షి, హైదరాబాద్ .. ఇలా ఒకరిద్దరు కాదు, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 482 మంది పురుషులు అదృశ్యమయ్యారు. సగటున రోజుకు నలుగురు గాయబ్ అవుతున్నారు. అత్యధికంగా మాదాపూర్ జోన్లో 194 మంది మగాళ్లు తప్పిపోగా.. బాలానగర్ జోన్ పరిధిలో 136 మంది, శంషాబాద్ జోన్లో 152 మంది కనబడకుండా పోయారు. ఈ 3 జోన్లలో కలిపి 332 మందిని గుర్తించారు. గత రెండేళ్లలో 2,943 మంది అదృశ్యమయ్యారు. చెప్పాపెట్టకుండా.. ఇష్టం లేని పెళ్లి, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే పురుషులు అదృశ్యమవడానికి ప్రధాన కారణాలని రాచకొండ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ శింగేనవర్ తెలిపారు. అన్సౌండ్ మైండ్ (మానసికంగా దృఢంగా లేనివాళ్లు) తప్పిపోతే.. వాళ్ల ఆచూకీకి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఒత్తిడి, పెట్టుబడుల్లో నష్టం, రుణాల వల్ల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు చెప్పాపెట్టకుండా వెళ్లిపోతున్నారని మరో పోలీసు అధికారి తెలిపారు. ‘‘ఇటీవల మాదాపూర్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి అప్పులు చేసి మరీ షేర్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. నష్టం రావడంతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు పీఎస్‌లో కేసు నమోదయింది’’ అని ఆయన చెప్పారు. వలస కార్మికుల పరారీ బీహార్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది వలస కార్మికులు భవన నిర్మాణ పనుల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటారు. వీరిలో చాలా మంది కాంట్రాక్టర్లకు చెప్పకుండా రాత్రికిరాత్రే పని ప్రదేశాల నుంచి పారిపోతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనిల్ ఓరన్ పుప్పాలగూడలోని అపర్ణ కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న ప్రాజెక్టులో లేబర్‌గా చేరాడు. గత నెల 2న నార్సింగి మార్కెట్‌కు వెళ్లి తిరిగి లేబర్ క్యాంప్‌కు రాకపోవడంతో సైట్ ఇంజనీర్ దాసరి ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పని ప్రదేశాలలో గొడవలు, అప్పులు, ఒత్తిడితో కార్మికులు పనులను వదిలేసి అదృశ్యమవుతున్నట్లు విచారణలో తేలింది. ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్: అదృశ్యమైన వ్యక్తుల ఫోన్‌ను పోలీసులు ట్రాకింగ్‌లో పెడతారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి వ్యక్తి ఫొటో, చిరునా మాలతో కరపత్రాలను ముద్రించి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, బహిరంగ ప్రదేశాల్లో అంటిస్తారు. దర్పణ్ యాప్, పోలీసు వెబ్సైట్లలో వ్యక్తి ఫొటో, వివరాలను అప్లోడ్ చేస్తారు. అదృశ్యమైన వ్యక్తికి శత్రువులు, అప్పులు ఇచ్చినవాళ్లు ఉన్నారా ఆరా తీసి వారిపై నిఘా పెడుతుంటారు. ట్రేస్ చేసి పట్టుకుంటున్నాం పురుషులు చిన్న చిన్న గొడవలతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటారు. కొంతకాలం తర్వాత వాళ్లే తిరిగి వస్తుంటారు. మిస్సింగ్ ఫిర్యాదు అందగానే ప్రత్యేక వ్యవస్థ ద్వారా ట్రేస్ చేసి పట్టుకుంటున్నాం. – స్టీఫెన్ రవీంద్ర పోలీస్ కమిషనర్, సైబరాబాద్ -
ఠాణా.. తందానా..అవినీతి మకిలీలో హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్/మణికొండ: బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే భక్షిస్తున్నారు. కేసుల నమోదు, స్టేషన్ల బెయిల్, భూవివాదాలు, సినిమా షూటింగ్ అనుమతులు.. ఇలా పోలీసుల అవసరం ఉన్న ప్రతీ చోట వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఏసీపీ, డీసీపీలూ తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తుండటంతో బాధితులు నేరుగా పోలీస్ కమిషనర్లను ఆశ్రయిస్తున్నారు. ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపి సదరు పోలీసులను సస్పెండ్ చేస్తున్నా రు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి ఠాణాలో ఇన్స్పెక్టర్, ఎస్ఐలపై సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెన్షన్ వేటు వేశారు. రెండ్రోజుల క్రితమే ఓ నేరస్తునితో జట్టు కట్టి డబ్బులు వసూలు చేసిన సరూర్‌నగర్ ఎస్ఐ సైదులును రాచకొండ సీపీ సస్పెన్షన్ చేసిన విషయం విదితమే. చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో పోస్టింగ్‌ల్లో మితిమీరిన రాజకీయ జోక్యం.. ►ఒక్క పోస్టింగ్ దొరికితే చాలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. అవినీతి, అక్రమాలు బయటపడిన స్థానిక రాజకీయ నేతలు వారిని కాపాడుతున్నారనే ఆరోపణలున్నాయి. ►రాజకీయ బలం ఉన్న ఇన్స్పెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకవేళ వేటు వేసినా.. తమకున్న రాజకీయ అండదండలతో వేరే చోట లేదా వేరే కమి షనరేట్‌లో పోస్టింగ్‌లు పొందుతున్నారు. నిజాయితీ గల అధికారులకు ఏళ్ల తరబడి ఎదురుచూసినా ఎస్హెచ్ఓ పోస్టింగ్ దక్కడంలేదు. ►పోస్టింగ్‌ల విషయంలో మితిమీరిన రాజకీయ జోక్యం ఉందనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. తమకు నచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇప్పిస్తుండటంతో పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చదవండి: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఓపిక ఉంటే అక్కడైనా రాయొచ్చు! సెటిల్మెంట్లలో.. భూ వివాదాలలో.. ►నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడంతో నేరస్తులతో దోస్తీ కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇన్స్పెక్టర్లు, సెక్టార్ ఎస్ఐలు కాసులు దండుకుంటున్నారు. ►అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నార్సింగి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మధనం గంగాధర్, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) కె. లక్ష్మణ్‌లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ►గతంలో వీరిద్దరిపై పలు భూ వివాదాలలో సెంటిల్మెంట్లు చేసినట్లు విచారణలో తేలింది. కొల్లూరు, జన్వాడ గ్రామాల సరిహద్దు భూ వివాదంలో తలదూర్చి సెటిల్మెంట్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది. దోస్తీ కట్టి.. దొరికిపోయి.. ►రెండు రోజుల క్రితమే సరూర్‌నగర్ ఎస్ఐ బి.సైదులును రాచకొండ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా నేరస్తుడితో సైదులుకు పరిచయం ఏర్పడింది. అనతికాలంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ►ఎస్ఐ కుటుంబంతో సహా కలిసి విజయవాడ విహారయాత్రకు వెళ్లాడు. ఆ సమయంలో నిందితుడు ఖరీదైన హోటల్లో బస ఏర్పాటు చేశాడు. రవాణా, భోజనం, ఇతరత్రా ఖర్చులను నేరస్తుడే భరించాడు. ఆయా బిల్లులన్నీ భద్రపరుచుకున్నాడు. ►తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక.. అధికారాన్ని వినియోగించుకొని తనను బెదిరించాడని సదరు నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఎస్ఐతో దిగిన ఫొటోలు, హోటల్ బిల్లులు తదితర ఆధారాలన్నీ జత చేశాడు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపిన సంబంధిత అధికారులు ఎస్ఐని సస్పెండ్ చేశారు. ‘సమర్పించు’కోకపోతే అనుమతులివ్వరు.. ►సినిమా షూటింగ్‌లకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే వారికి వసూళ్ల వేదికగా మారింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా, సరైన పత్రాలు ఉన్నా.. పోలీసులకు ‘సమర్పించు’కోకపోతే అనుమతులు రావు. ఇలాంటి సంఘటనలు నార్సింగి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ►ఆయా పీఎస్‌ల పరిధిలో షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉండటం వీరికి కలిసొచ్చే అంశం. అనుమతులు వచ్చినా, రాకపోయిన స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదించాల్సిందే. సెక్టార్ ఎస్ఐతో పాటు బీట్ కానిస్టేబుళ్లు, పెట్రోలింగ్ సిబ్బంది చేయి తడపనిదే సినిమా షూటింగ్ ముందుకు సాగని పరిస్థితి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ►కేవలం లా అండ్ ఆర్డరే కాదు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో సదరు అధికారులకు తడపనిదే పని జరగని పరిస్థితి. రాయదుర్గం పరిధిలోకి వచ్చే ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సినిమా నిర్మాతలకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. స్టేషన్ బెయిల్ కోసం లంచం.. గత నెల 21న స్టేషన్ బెయిల్ కోసం రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు మహేశ్వరం పీఎస్ కానిస్టేబుల్ యాదయ్య. మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన దయ్యాల బాల్‌రాజ్‌తో పాటు మరో అయిదుగురిపై భూ వివాదంలో మహేశ్వరం ఠాణాలో కేసు నమోదయింది. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి కానిస్టేబుల్ యాదయ్య (ఎస్ఐ రైటర్) రూ.25 లక్షల డిమాండ్ చేశాడు. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డికి రూ.20 లక్షలు, తనకి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. -
సైబరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన స్టీఫెన్ రవీంద్ర
-
సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు మూడేళ్లుగా బదిలీలు లేక.. పదోన్నతులు పొందినా అవే స్థానాల్లో కొనసాగుతున్న చాలా మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సైబరాబాద్ కమిషనర్‌గా మూడేళ్లకుపైగా బాధ్యతలు నిర్వహిస్తున్న వీసీ సజ్జనార్‌కు అదనపు డీజీగా పదోన్నతి కల్పించి ఆయన్ను టీఎస్ఆర్టీసీ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. అలాగే పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టీఫెన్ రవీంద్రను సైబరాబాద్ నూతన కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు డీజీ స్థాయిల్లో ఉన్న అధికారులను బదిలీ చేయడంతోపాటు వారి స్థానాల్లో ఐజీపీలను నియమించారు. హైదరాబాద్ అదనపు కమిషనర్ (ట్రాఫిక్)గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ అనిల్‌కుమార్‌ను మంగళవారం రాష్ట్ర నిఘా విభాగం అధిపతి (ఇంటెలిజెన్స్)గా అదనపు డీజీ హోదాలో నియమించిన నేపథ్యంలో ఆయన స్థానంలో తాత్కాలికంగా ఇన్చార్జి హోదాలో డీఎస్ చౌహాన్‌ను ప్రభుత్వం నియమించింది. ఎస్పీల నుంచి డీఐజీలుగా పదోన్నతి పొందినవారు, డీఐజీ నుంచి ఐజీలుగా పదోన్నతి పొందిన మరికొందరు సీనియర్ ఐపీఎస్‌లకు కూడా త్వరలోనే కొత్త పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ పగ్గాలు సజ్జనార్‌కు సవాలే... సైబరాబాద్ సీపీగా పనిచేసిన కాలంలో వీసీ సజ్జనార్ పలు సంచనాలకు కేరాఫ్‌గా నిలిచారు. ముఖ్యంగా ‘దిశ’పై గ్యాంగ్‌రేప్, హత్యకు పాల్పడిన నిందితులను సజ్జనార్ సారథ్యంలోని పోలీసు బృందం ఎన్కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సైబరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే కమిషనరేట్‌లో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కరోనా లాక్డౌన్ తొలినాళ్లలో హైదరాబాద్‌లోని ఇతర రాష్ట్రాల కార్మికులను సొంత ఊళ్లకు తరలించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న ఆర్టీసీ ఇప్పటికే పీకలల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతోపాటు దాని అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఆయన వీసీ అండ్ ఎండీగా ఎలా బయటపడేస్తారన్న అంశం కీలకం కానుంది. వచ్చే నెలలో... అవినీతి నిరోధక విభాగం, విజిలెన్స్ డీజీగా ఉన్న పూర్ణచంద్రరావు, జైళ్ల విభాగం డీజీ రాజీవ్ త్రివేదీ సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ రెండు పోస్టులకు డీజీ లేదా అదనపు డీజీ అధికారులను నియమించాల్సి ఉంది. అలాగే రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్‌కు స్థాన చలనం జరిగితే ఆ స్థానంలో నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డిని నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ నాలుగు జిల్లాలకు.. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ములుగు జిల్లాలకు ప్రస్తుతం ఎస్పీలు లేరు. ఆ నాలుగు జిల్లాలు ఇప్పుడు ఇన్‌ఛార్జిల పాలనలో ఉన్నాయి. ఈ జిల్లాలకు త్వరలోనే ఎస్పీలను నియమించే అవకాశం ఉంది. ఇటీవల 32 మందికి నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు దక్కాయి. వారిలో చాలా మందికి జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నారు. నిజామాబాద్ సీపీగా కార్తీకేయకు ఆ స్థానంలో ఐదేళ్లు పూర్తయింది. ఆయన కూడా బదిలీ జాబితాలో ఉన్నారు. అలాగే నల్లగొండ ఎస్పీ, డీఐజీ రంగనాథ్.. కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఎంను కలిసిన ఇంటెలిజన్స్ చీఫ్.. రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా నియమితులైన డాక్టర్ అనిల్‌కుమార్ బుధవారం ఉదయం మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్‌ను కలసి పుష్పగుచ్ఛం అందచేశారు. అంజనీకుమార్‌కు పదోన్నతి...హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అదనపు డీజీ స్థాయి అధికారి అంజనీకుమార్‌కు డీజీ స్థాయి పదోన్నతి లభించింది. 1989–90 బ్యాచ్‌లకు చెందిన మొత్తం నలుగురు అదనపు డీజీలకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేష్ షరాఫ్ (సంక్షేమ విభాగం ఏడీజీ)తోపాటు 1990 బ్యాచ్ అధికారులు గోవింగ్ సింగ్ (సీఐడీ చీఫ్), అంజనీకుమార్, రవిగుప్తా (హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ) ప్రమోషన్లు ఇచ్చింది. వారిలో ఉమేష్ షరాఫ్‌ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి బదిలీ చేయగా మిగిలిన ముగ్గురిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చదవండి: హైదరాబాద్ మెట్రో రైలుకు గుడ్‌న్యూస్! -
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర!
సాక్షి, హైదరాబాద్/అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియామకం ఖరారైంది. ఈ మేరకు ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం కుదరడంతో ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) నుంచి అధికారిక ఆమోదం రావడమే మిగిలింది. ఇందుకు మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. తెలంగాణ కేడర్‌కు చెందిన 1999 బ్యాచ్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర విధి నిర్వహణలో సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో అనంతపురం, వరంగల్ జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించారు. తెలంగాణలో మావోయిజం, రాయలసీమలో ఫ్యాక్షనిజానికి కళ్లెం వేయడంలో సఫలీకృతమయ్యారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో స్టీఫెన్ రవీంద్ర ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఐజీగా కొనసాగుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో సంచలనం సృష్టించిన ప్రజల వ్యక్తిగత డేటా చోరీ కేసులో టీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఆయన పలు పురస్కారాలు పొందారు. 2010లో ప్రధానమంత్రి పోలీసు మెడల్, 2016లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. ఏపీ అడగ్గానే అంగీకరించిన తెలంగాణ.. ఏ రాష్ట్రానికైనా నిఘా విభాగం అత్యంత కీలకం. పైగా ఏపీకి దేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉండటంతోపాటు ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. భౌగోళికంగా పెద్ద రాష్ట్రమైన ఏపీలో ఇంటెలిజెన్స్‌కు నేతృత్వం వహించడం అంత సులువు కాదు. గతంలో విధి నిర్వహణలో స్టీఫెన్‌కు ఉన్న అనుభవాన్ని ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని భావించింది. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి జగన్ వెళ్లడం.. అక్కడ ఆయనకు కేసీఆర్ ఘనస్వాగతం పలికి సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ భేటీతో రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని ఇరువురూ చాటిచెప్పారు. ఈ స్నేహపూర్వక వాతావరణం కారణంగానే ఏపీ ప్రభుత్వం స్టీఫెన్ రవీంద్రను కావాలని అడగ్గానే తెలంగాణ సర్కారు అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్టీఫెన్ రవీంద్ర గుంటూరు జిల్లా తాడేపల్లి వెళ్లి జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మరోవైపు ఏపీ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ డి.గౌతం సవాంగ్ కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. మరికొందరు కూడా..! తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులు ఏపీకి డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇప్పటికే ముగ్గురు అధికారులు ఇదే విషయమై విజయవాడ వెళ్లి ప్రయత్నించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐదుగురు, ఉత్తర తెలంగాణలో పనిచేస్తున్న మరో అధికారి కూడా ఏపీకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. -
వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు ఉన్నతాధికారులు
-
జగన్‌ను కలిసిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లు
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోమవారం సాయంత్రం పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిశారు. విశాఖ, తూర్పు గోదావరి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు మర్యాదపూర్వకంగా వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. సీనియర్ అధికారులు కృష్ణబాబు, వరప్రసాద్, సంధ్యారాణి, లక్ష్మీకాంతం, సత్యనారాయణ, సంజయ్, జవహర్ రెడ్డి, అరుణ్ కుమార్, శశిభూషణ్, ప్రవీణ్ కుమార్, ఉదయలక్ష్మి, ఇక కలెక్టర్లు ప్రద్యుమ్న, కాటమనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా, సత్యనారాయణ, ముత్యాలరావు, ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, ఎస్పీలు రవిప్రకాశ్, మేరీ ప్రశాంతి తదితరులు ఉన్నారు. కాగా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని సోమవారం ఉదయం తాడేపల్లి చేరుకున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు ఉన్నతాధికారులు -
ఏ క్షణంలోనైనా అశోక్ అరెస్టు!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపుతోన్న ఐటీ గ్రిడ్స్‌లో ప్రధాన నిందితుడు అశోక్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని తెలంగాణ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడి కదలికలకు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం ఉందని పేర్కొన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం న్యాయ వ్యవస్థను తప్పు పట్టించడమేనన్నాయి. ఇందుకు సంబంధించి ఏపీలో కేసు నమోదైనా అది చట్టపరంగా నిలవదని పేర్కొన్నాయి. పరారీలో ఉన్న నిందితుడికి ఆశ్రయం కల్పించడమే కాకుండా.. అతడిని నిర్దోషిగా నిరూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు న్యాయపరంగా చెల్లేవి కావని తెలిపాయి. నిందితుడిని చట్టం నుంచి కొన్నాళ్లు కాపాడినా చివరికి అతడు కోర్టు బోను ఎక్కక తప్పదని... చట్ట పరిధిలోనే తమ విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశాయి. చదవండి : (అశోక్ అమరావతిలో ఉన్నా..అమెరికాలో ఉన్నా...) కాగా ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ మాదాపూర్ పోలీసులకు లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఈనెల 2న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఐటీగ్రిడ్ సంస్థపై దాడులు చేసి కొన్ని కంప్యూటర్లు ట్యాబ్‌లు స్వాధీనం చేసుకున్నారు. 120(బీ), 379, 420, 188తోపాటు ఐపీసీ 72, 66(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన కేసు కావడంతో.. విచారణ నిమిత్తం హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.(డేటా చోరీ ప్రకంపనలు.. తస్మాత్ జాగ్రత్త!)