సోదరి ప్రేమ పెళ్లి.. అన్న ఆత్మహత్యాయత్నం | sister love marriage..brother suicide attempt | Sakshi
Sakshi News home page

సోదరి ప్రేమ పెళ్లి.. అన్న ఆత్మహత్యాయత్నం

Mar 1 2018 9:51 AM | Updated on Nov 6 2018 7:53 PM

sister love marriage..brother suicide attempt - Sakshi

ప్రేమ జంట అవంతి, నర్సింహులు, ఆత్మహత్యాయత్నం చేసిన అవంతి సోదరుడు రాజు

కామారెడ్డి: ఓ యువకుడు భిక్కనూరు పోలీసుస్టేషన్‌లో బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించగా, ఈ పెళ్లిని ఒప్పుకోనంటూ అమ్మాయి సోదరుడు ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా ఉత్కంఠ రేపింది. అసలేం జరిగిందంటే.. భిక్కనూరు మండలంలోని కాచాపూర్‌ గ్రామానికి చెందిన భూమని నర్సింహులు, అదే గ్రామానికి చెందిన జోగు అవంతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో బుధవారం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.

అనంతరం తమకు రక్షణ కల్పించాలని భిక్కనూరు పోలీసుస్టేషన్‌కు వచ్చారు. వారిద్దరు మేజర్‌ కావడంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయితే, ఈ పెళ్లికి తాను ఒప్పుకోనంటూ అవంతి సోదరుడు రాజు ఠాణా నుంచి బయటకు వచ్చి విష గుళికలు మింగాడు. ఇది గమనించిన పోలీసులు హుటాహుటిన 108 వాహనంలో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాజు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు రాజుపై కేసు నమోదు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement