ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి | Seven Killed In Road Accident In Tamilnadu | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

May 6 2019 6:33 PM | Updated on May 6 2019 6:39 PM

Seven Killed In Road Accident In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిని మహారాష్ట్రకు చెందిన రైల్వే పోలీసులు అధికారి మెల్విన్‌ దేశ్‌ముఖ్‌ కుటుంబ సభ్యులుగా గుర్తించారు.

తమిళనాడు యాత్రకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement