ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య | Seven of family commit suicide in Ranchi | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య

Jul 31 2018 4:25 AM | Updated on Oct 2 2018 4:31 PM

Seven of family commit suicide in Ranchi - Sakshi

రాంచీ: జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు బలవన్మరణం చెందారు. రాంచీలోని కంకే పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే సచ్చిదానంద ఝా(65), గాయత్రీ దేవీ(60) దంపతులకు దీపక్‌ (40), రూపేశ్‌ (30)కుమారులు కాగా దీపక్‌కు భార్య సోని, ఆరేళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీపక్‌ రాంచీలో ఫర్నిచర్‌ స్టోర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం దీపక్‌ కుమార్తెను స్కూల్‌కు తీసుకెళ్లేందుకు వచ్చిన బస్సు క్లీనర్‌ ఆ ఇంటి తలుపులు వేసి ఉండడం గమనించి పొరుగు వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా సచ్చిదానందతోపాటు, దీపక్‌ పిల్లలిద్దరి శరీరాలపై కత్తిగాట్లున్నాయి. గాయత్రీదేవి, దీపక్, సోని, రూపేశ్‌ ఉరి వేసుకుని కనిపించారు. అప్పటికే అందరూ చనిపోయినట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాము చనిపోతున్నట్లు సచ్చిదానంద తన సూసైడ్‌ లేఖలో పేర్కొన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement