సారూ.. ఏందీ ఈబుద్ధి? | School principal arrested for allegedly molesting 9th standard student | Sakshi
Sakshi News home page

విద్యార్థిపై ప్రిన్సిపాల్‌ లైంగిక దాడి

Nov 25 2017 2:43 PM | Updated on Sep 15 2018 5:45 PM

School principal arrested for allegedly molesting 9th standard student - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల కళ్లు పైశాచికత్వంతో మూసుకుపోతున్నాయి. భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన టీచర్లు, కీచకులూ విద్యార్థులను భయాల గుప్పిట్లోకి నెట్టేస్తున్నారు. విద్యార్ధులపై లైంగిక దాడికి పాల్పడుతూ, ఆపై ఎవరికైన చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఈసీఐఎల్‌లో విద్యార్థిని లైంగికంగా వేధించిన స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈసీఐల్‌లోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌-2(ఏఈసీఎస్‌)లో పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని ప్రిన్సిపాల్ మహాపాత్ర(54) లైంగికంగా వేధించాడు. స్కూల్‌ సమయం అయిపోయి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని తన ఛాంబర్‌కు పిలిచాడు. కూల్‌డ్రింక్‌, స్నాక్స్‌ ఇచ్చిన ప్రిన్సిపాల్‌ ఛాంబర్‌ డోర్‌ వేసి బలంవంతంగా ముద్దుపెట్టాడు. విషయం ఎక్కడ చెప్పొద్దని ఒట్టు వేయించున్నాడు. దీని గురించి బయట చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు.

ఈ సంఘటన అనంతరం ఇంటికి వచ్చిన ఆ విద్యార్థి మరుసటి రోజు పాఠశాల వెళ్లడానికే భయపడియింది. అయితే బాలికను గమనించిన తల్లిదండ్రులు ఏమైందని ఆరాతీయగా అసలు విషయం బయట పడింది.దీంతో తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌ మహాపాత్రపై షీ టీమ్స్‌కి ఫిర్యాదు చేశారు. స్పందించిన కుషాయిగూడ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement