లైంగిక వేధింపులకు పాల్పడిన హెచ్‌ఎం | School Headmaster Manhandled For Sexual Abuse | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులకు పాల్పడిన హెచ్‌ఎంకు దేహశుద్ధి

Apr 21 2018 9:40 AM | Updated on Oct 20 2018 6:19 PM

School Headmaster Manhandled For Sexual Abuse - Sakshi

ప్రధానోపాధ్యాయుడ్ని  విచారిస్తున్న ఎస్సై, ఎంఈఓ  

నాయుడుపేటటౌన్‌ : మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలిని లైంగికంగా వేధిస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన నాయుడుపేట ఎల్‌ఏసాగరం అగ్రహారపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. పట్టణంలోని ఏల్‌ఎసాగరం అగ్రహారపేట ప్రభుత్వ పాఠశాలలో  ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కావేరిపాకం అంజయ్య మధ్యాహ్న భోజన పథక  నిర్వాహకురాలిని కొద్దిరోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు.

ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సరుకులు తీసుకెళుతుండగా ప్రధానోపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.  పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై రవినాయక్, ఎంఈఓ ఎన్‌ శ్రీనివాసులు పాఠశాల వద్దకు చేరుకుని జరిగిన  ఘటనపై విచారించారు. ప్రధానోపాధ్యాయుడ్ని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి బాధితురాలు  పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement