ఒక హత్య..రెండు స్టోరీలు

Ryan International School " one muder two stories - Sakshi

గుర్గావ్‌: రియాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థి ప్రద్యుమ్నహత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది.  ప్రద్యుమ్న  హత్య కేసులో తాజా  నిందితుడిని జువెనైల్ హోమ్ కు తరలించాలని జువైనల్‌ కోర్టు ఆదేశించింది. విద్యార్థిని ప్రశ్నించేందుకు స్వతంత్ర సంక్షేమ అధికారిని నియమించింది.  తదుపరి విచారణను నవంబరు 22వ తేదీకి వాయిదా వేసింది.  
 
ఈ హత్యకేసులో కీలక నిందితుడుగా  అరెస్ట్‌ చేసిన సీనియర్‌ విద్యార్థిని సీబీఐ  ప్రశ్నించింది.  నిందితుడిని తీసుకొని  స్కూలుకెళ్లి డమ్మీ బొమ్మతో  సంఘటన మొత్తాన్ని ఎనాక్ట్‌ చేయించామనీ, ప్రతీ చిన్న అంశాన్ని క్షుణ్ణంగా విచారించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.  నిందితుడు నేరాన్ని అంగీకరించాడని అధికారులు స్పష్టం చేశారు.  బస్‌ కండక్టర్‌ను అరెస్ట్‌ చేసినపుడు కూడా కండక్టర్‌ నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు  ప్రకటించడం గమనార్హం.

మరోవైపు  తన కొడుకు అమాయకుడని..   మైనర్ అయిన తన కొడుకునుదారుణంగా  హింసించారని తండ్రి ఆరోపించారు..  విచారణలో భాగంగా తలకిందులుగా వేలాడదీసి చిత్ర హింసలకు గురిచేశారన్నారు.  అంతేకాదు తన కుమారుడి ప్రతిభ,  మంచి ప్రవర్తనపై  టీచర్లనుంచి అనేకసార్లు ప్రశంసలు లభించాయని చెప్పారు. దీంతో  జువైనల్‌ జస్టిస్‌ బోర్డు సీబీఐని వివరణ కోరింది.  11 వ తరగతి విద్యార్థి విచారణ సమయం విషయంలో ఎందుకు నిబంధనలు ఉల్లఘించారంటూ సీబీఐని ప్రశ్నించింది. అయితే నిందితుడి తండ్రి ఆరోపణలను సీబీఐ  తీవ్రంగా ఖండించింది.

 ఏడేళ్ల విద్యార్థి ప్రద్యుమ్నను లైంగికంగా వేధించి చంపాడని ఆరోపిస్తూ పోలీసులు బస్ కండక్టర్ అశోక్ కుమార్‌పై హర్యానా పోలీసులు  కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించారు.  దీంతో కేసు మరో మలుపు తిరిగింది. అదే స్కూల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్ధి పరీక్ష వాయిదా కోసమే ప్రద్యుమ్నను హత్య చేశాడని  సీబీఐ విచారణలో అధికారులు తేల్చారు.  తాజా పరిణామంతో ప్రద్యుమ్న హత్య కేసులో బాధిత కండక్టర్  పోలీసులపై న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నారు.  తన క్లయింట్‌తో బలవంతంగా నేరాన్ని  అంగీకరింప చేశారని, బలిపశువును చేశారని ఆయన తరపు న్యాయవాది మోహిత్ వర్మ ఆరోపించారు. అటు తన కుమారుడిమరణంపై న్యాయం జరిగేంతరకు పోరాటంచేస్తామని ప్రద్యుమ్న తండ్రి  ప్రకటించారు. హంతకుడికి మరణ శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు.

కాగా ఈ మొత్తం వ్యవహారంలో హర్యానా పోలీసులపైనా, రియాన్ స్కూల్ యాజమాన్యంపైనా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే ట్విస్ట్‌లు ట్విస్టులు తిరుగుతున్న చిన్నారి హత్య  కేసులో అసలు హంతకులెవరో తేలతారా?  నిందితుడు మైనర్‌ కావడంతో ..ఒక వేళనేరస్తుడిగా తేలిగా ఎలాంటి శిక్ష పడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top