
దుండగులు పగులగొట్టిన హుండీని పరిశీలిస్తున్న ఎస్‌ఐ విజయభాస్కర్
కృష్ణగిరి: చుంచుఎర్రగుడి గ్రామ శివారులోని అతిపురాతన రామలింగేశ్వరస్వామి ఆలయంలో మళ్లీ దొంగలు పడ్డారు. పోలీసులు వివరాల మేరకు.. గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి ఆలయ ప్రధాన ద్వారానికి ఉన్న తాళం పగులగొట్టి హండీని ఎత్తుకెళ్లారు. తర్వాత దేవనకొండ మండలం బండపల్లె గ్రామానికి వెళ్లే దారిలో హుండీని పగులగొట్టి అందులోని కానుకలు(ఏడాదివి) ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ ఓ. విజయభాస్కర్ ఆలయానికి చేరుకుని ఘటన జరిగిన తీరుపై పూజారి నాగయ్య, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇదే ఆలయంలో 2016 జూలై 23న ఒకసారి, అదే ఏడాది అక్టోబర్ 4న మరోసారి చోరీ జరిగింది. ఆలయంలో వరుస చోరీలు జరుగుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.