కృష్ణాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident Near Nandigama Krishna District - Sakshi

సాక్షి, నందిగామ : కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం లారీని కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. నందిగామ నుంచి నలుగురు యువకులు కారులో(ఏపీ16డీబీ 5587) విజయవాడకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు అంబార్‌పేటకు చేరుకోగానే అతివేగంతో డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ఘటన స్థలంలోనే మృతిచెందారు. మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. మృతులను నందిగామకు చెందిన దుర్గా, మనోజ్‌, అరవింద్‌, అనిల్‌గా గుర్తించారు. కాగా, ప్రమాద సమయంలో కారు 120 కి.మీ వేగంతో వెళ్తుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top