పండుగ వేళ విషాదం | Road Accident In Anantapur | Sakshi
Sakshi News home page

పండుగ వేళ విషాదం

Oct 20 2018 1:53 PM | Updated on Oct 20 2018 1:53 PM

Road Accident In Anantapur - Sakshi

మృతుడు బాలరంగారెడ్డి  ప్రాణాలు కోల్పోయిన శివశంకర్‌

పెద్దవడుగూరు: దసరా పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. పండుగ కోసం ఇంటికి బయల్దేరిన యజమానిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. క్రిష్టిపాడు జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. వివరాల్లోకెళ్తే.. గుత్తి మండలం గొందిపల్లికి చెందిన బాలరంగారెడ్డి(48) లారీ డ్రైవర్‌. గురువారం దసరా పండుగ కావడంతో దొందరగా ఇంటికెళ్లాలనే ఉద్దేశ్యంతో రాయలచెరువులో లారీ విధులు ముగించుకున్నాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సొంత ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరాడు. క్రిష్టిపాడు జాతీయ రహదారి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలరంగారెడ్డిని స్థానికులు గమనించి 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌ చేరుకునేలోపే బాలరంగారెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు.

   
తాడిపత్రి అర్బన్‌: తాడిపత్రి మండలం బొడాయిపల్లెకు చెందిన శివశంకర్‌ (34) సద్దలదిన్నె వద్ద పాలిష్‌ బండల ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. శుక్రవారం ఉదయం పనిమీద ద్విచక్రవాహనంలో బొడాయిపల్లె నుంచి బయల్దేరిన శివశంకర్‌ సద్దలదిన్నె సమీపాన పోతులయ్య కట్ట రోడ్డుపై ఉన్న గుంత వద్ద అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108 ద్వారా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి భార్య ఆశాలత, కుమార్తెలు రక్షిత, తనూష, రజనీని ఓదార్చటం ఎవరి తరమూ కాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement