ఏడేళ్ల బాలికపై అత్యాచారం | Rape attempt on a seven years old girl | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల బాలికపై అత్యాచారం

Feb 27 2018 8:11 PM | Updated on Aug 21 2018 6:02 PM

Rape attempt on a seven years old girl - Sakshi

సాక్షి, కర్ణాటక : క్రిష్ణగిరి సమీపంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మహారాజగడ సమీపంలోని కోడినాయకనపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన చెన్నప్పన్‌(54) చాక్‌లెట్‌ ఇస్తానని ఆశ చూపి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో సమీపంలోని పశువుల కాపరులు సంఘటన స్థలానికి చేరుకొని చెన్నప్పన్‌కు దేహశుద్ధి చేసి క్రిష్ణగిరి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెన్నప్పన్‌ను అరెస్టు చేసి బాలికను చికిత్స కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement