శ్రీనివాస్‌ ఫోన్‌ నుంచి 10 వేల కాల్స్‌

Probe Continues In Murder Attempt On YS Jagan Case - Sakshi

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో అనుమానాలు బలపడుతున్నాయి. జననేతను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక రచించినట్టు దర్యాప్తులో వెల్లడవుతోంది. వాస్తవాలు ఒక్కొటి వెలుగు చూస్తుండటంతో వైఎస్‌ జగన్‌ను మట్టుబెట్టేందుకు తెర వెనుక పెద్ద కుట్రే జరిగిందని తేలుతోంది.

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాలు, కాల్‌ డేటాను పోలీసులు పరిశీలించారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని సీసీ కెమెరాల ఫుటేజీపైనా కూడా దృష్టి పెట్టారు.

9 ఫోన్లు, 10 వేల కాల్స్‌
ఏడాది కాలంలో 9 ఫోన్లు మార్చిన నిందితుడు శ్రీనివాసరావు 10 వేల ఫోన్‌ కాల్స్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పదివేల కాల్స్‌ కేవలం 397 ఫోన్ నంబర్లకు చేసినట్టు వెల్లడైంది. ఇందులో కొంతమందితో తరచుగా మాట్లాడినట్టు కాల్‌ డేటా ఆధారంగా గుర్తించారు. ఎయిర్‌పోర్టులోని ప్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ సిబ్బందిలో ముగ్గురిని సిట్‌ అధికారులు విచారణకు పిలిచారు.
 

సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన
విశాఖ ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరా ఫుటేజీని సిట్‌ అధి​కారులు పరిశీలిస్తున్నారు. 32 సీసీ కెమెరాల ఫుటేజీని 4 హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. హత్యాయత్నం జరిగిన ప్రాంతంలో మాత్రం సీసీ కెమెరా లేకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. నెల రోజులుగా శ్రీనివాసరావు కదలికలపై సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. సీఐఎస్‌ఎఫ్‌, పోలీసు సిబ్బందితో అతడు చనువుగా ఉండేవాడని వెల్లడైంది.
 

బ్యాంకు ఖాతాలపై ఆరా
శ్రీనివాసరావుకు మూడు బ్యాంకు ఖాతాలున్నట్టు పోలీసులు గుర్తించారు. విజయ బ్యాంక్, ఆంధ్రా బాంక్, స్టేట్ బ్యాంకుల్లో అతడి ఖాతాలను పరిశీలించారు. అతడికి ఖాతాలోకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వచ్చాయనే దానిపై ఆరా తీశారు. ముమ్మిడివరంలో శ్రీనివాసరావు కోటి రూపాయల విలువచేసే భూముల కొనుగోలుకు బేరం చేసినట్టు వచ్చిన వార్తలపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు శ్రీనివాసరావును కోర్టు వచ్చే నెల 2 వరకు పోలీస్‌ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు...

జగన్‌పై హత్యాయత్నం: దారితప్పిన దర్యాప్తు

బిర్యానీ కావాలన్న శ్రీనివాస్‌..

అందుకేనా.. అంత జల్సా!

అది హత్యాయత్నమే

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top