నటుడి ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు | Police Probe on Thadi Balaji, Nithya Complaints | Sakshi
Sakshi News home page

నటుడి ఫిర్యాదుపై పోలీసుల దర్యాప్తు

Oct 12 2017 12:06 PM | Updated on Oct 12 2017 1:00 PM

thadi_balaji

సాక్షి, చెన్నై: బుల్లితెర నటుడు, వ్యాఖ్యాత దాడి బాలాజి, ఆయన భార్య నిత్య ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలాజి నుంచి విడాకులు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును నిత్య ఆశ్రయించగా, ఆమెపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఆయన ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు విల్లివాక్కం పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. వీరిద్దరితో పాటు విద్యుత్‌ కార్యాలయ ఉద్యోగి పైసల్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

బాలాజి, నిత్య మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తలిసిందే. మనస్పర్థల కారణంగా ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలాజి నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో ఇటీవల నిత్య పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే పైసల్‌తో నిత్యకు అక్రమ సంబంధం ఉందని బాలాజి ఆరోపించారు. నిత్య ఒక ఎస్‌ఐ సహాయంలో తనను బెదిరిస్తున్నట్టు పోలీస్‌కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వాస్తవాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement