జయరాం కేసు: రౌడీషీటర్ల అరెస్ట్‌కు రంగం సిద్ధం

Police Officials are Preparing for The Arrest Of Two Rowdysheeters In Jayaram Murder Case - Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసుతో సంబంధం ఉన్న నగేష్‌, విశాల్‌ అనే ఇద్దరు రౌడీ షీటర్ల అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జయరాం హత్యకేసులో ఇప్పటికే అరెస్ట్‌ చేసిన నిందితులకు ఆరో రోజు కస్టడీ విచారణ ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డితో పాటు ఆయనతో సంబంధాలున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.

జయరాం హత్యకు ముందు 48 గంటలు, తర్వాత 48 గంటలు రాకేష్‌ రెడ్డితో టచ్‌లో ఉన్నవారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితురాలు శ్రిఖా చౌదరీ స్టేట్‌మెంట్‌ను పోలీసులు మరోసారి రికార్డు చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో సుమారు 60 మందిని పోలీసులు విచారించారు. శనివారం అనుమానం ఉన్న మరి కొద్ది మందిని కూడా విచారిస్తామని పోలీసులు వెల్లడించారు.

జయరాంను చంపిందెవరో తెలిసిపోయింది..!
నగేశ్‌ సాయంతో రాకేష్ రెడ్డి భారీ స్కెచ్

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top