బంజారాహిల్స్‌లో రేవ్‌ పార్టీ, 8 మందిపై కేసు | Police Busted Rave Party In Banjara Hills Hotel | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో రేవ్‌ పార్టీ, 8 మందిపై కేసు

Jul 5 2020 6:11 PM | Updated on Jul 5 2020 6:49 PM

Police Busted Rave Party In Banjara Hills Hotel - Sakshi

హైదరాబాద్ ‌: నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శనివారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో చోటుచేసుకుంది. రేవ్‌ పార్టీపై పక్కా సమాచారం అందడతో పోలీసులు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి వేళ హోటల్‌లో హంగామా సృష్టించిన మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో నలుగురు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు. వీరిలో ఉక్రెయిన్‌కు చెందిన ఒక విదేశీ యువతి కూడా ఉన్నట్టుగా సమాచారం. కాగా, వీరు హోటల్‌లో ఓ రూమ్‌ బుక్‌ చేసుకుని హంగామా చేసినట్టుగా తెలుస్తోంది.

గతంలో జూబ్లీహిల్స్‌లో రేవ్‌పార్టీ నిర్వహించిన వ్యక్తే.. దీని వెనక కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు కరోనా నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి సమయంలో పార్టీ చేసుకోవడంతో.. అందుకు సంబంధించిన సెక్షన్ల కింద కూడా నిందితులపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement