జ్యోత్స్న మృతి కేసు : అంకుర్‌, పవన్‌ల అరెస్ట్‌

Police Arrested Ankur And Pawan In Jyotsna Dead case - Sakshi

సాక్షి విశాఖపట్నం : నగరంలో తీవ్ర కలకలం రేపిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని జ్యోత్స్న మృతి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఫ్యాకల్టీ అంకూర్‌, అతని స్నేహితుడు పవన్‌లను ఫోర్త్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొబైల్‌ ఫోన్‌లో అంకుర్‌, జ్యోత్స్న మధ్య ఉన్న మెసేజ్‌లు, కాల్‌ డేటా, ఫోటోల ఆధారంగా న్యాయ సలహా మేరకు ఆ ఇద్దరిని అరెస్ట్‌ చేశామని ఫోర్త్‌ టౌన్‌ సీఐ రవి తెలిపారు. అంకుర్‌, పవన్‌లపై ఐపీసీ 306,201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. కాల్‌ డేటా, మెసేజ్‌ల ద్వారా జ్యోత్స్న, అంకుర్‌ల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్‌ ఉందన్న విషయం తెలిసిందన్నారు. జ్యోత్స్న పోస్ట్‌మార్టం నివేదిక రావాడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీఐ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు
బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

జ్యోత్స్న మృతిపై దర్యాప్తు ముమ్మరం
ప్రేమ వ్యవహారమే కారణమా..?

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top