తన ఓటమికి కారణమాయ్యడని కత్తితో దాడి

Person Attacked With Knife On Other Person In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల : ఓటమి చెందారనే కోపంతో అధికార పార్టీకి చెందిన నాయకుడే అదే పార్టీకి చెందిన మరో నాయకుడిపై కత్తితో దాడి చేసి గాయపర్చిన సంఘటన సీసీసీ నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై ప్రమోద్‌రెడ్డి కథనం ప్రకారం... నస్పూర్‌ 2వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ తరుఫున రౌతు రజిత పోటీ చేసింది. ఆమె భర్త శ్రీనివాస్, ఐతే రజిత ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైంది. కౌంటింగ్‌ పూర్తి అయిన సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత వారు నివాసం ఉంటే సీసీసీ శుభాష్‌నగర్‌కు చెందిన మరో టీఆర్‌ఎస్‌ నేత అమృతరాజ్‌కుమార్‌ తమకు ఎన్నికల్లో సహాయం చేయలేదని కోపంతో రజిత మరిది రౌతు సత్యనారాయణ అతడితో గొడవకు దిగారు.

సత్యనారాయణ ముందుగా రాజ్‌కుమార్‌ ఇంటికి వెళ్లి మాట్లాడేది ఉందని, బయటికి రమ్మని చెప్పారు. దీంతో రాజ్‌కుమార్‌ బయటికి వచ్చిన తరువాత మాట్లాడుతూనే తమకు ఎన్నికల్లో సహకరించకుండా రెబల్‌ అభ్యర్థికి గెలుపునకు కారణం అయ్యావని, మా వదిన ఓడిపోవడానికి నీవే కారణం అంటూ కత్తితో కడుపులో దాడిచేశాడు. అంతలోనే తేరుకున్న రాజ్‌కుమార్‌ అక్కడ ఉన్న వారి సహాయంతో తప్పించుకున్నారు. వెంటనే స్థానికులు అతడిని  మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆయన్ను ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. రాజ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top