అడ్డువచ్చాడని రాడ్‌తో కొట్టి చంపేశారు | Sakshi
Sakshi News home page

అడ్డువచ్చాడని రాడ్‌తో కొట్టి చంపేశారు

Published Sun, Apr 19 2020 11:29 AM

Person Assasinated In Lakkavarapukota - Sakshi

సాక్షి, లక్కవరపుకోట : దాయాదుల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని సంతపేటలో చోటుచేసుకుంది. ఎస్సై కె. ప్రయోగమూర్తి, మృతుడి బంధువులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.  కొరుపోలు దేముడుబాబు, అతని దాయాదులకు కొత్తవలస–కిరండోల్‌ (కె.కె)లైన్‌ సమీపంలో పశువుల కళ్లాలున్నాయి. ఈ కళ్లాల చెంతనే గల చెరువు గర్భాన్ని ఆక్రమించుకుని పెంటలు ఏర్పాటు చేసుకుని.. కొంత భూమిని నడక దారిగా  వినియోగించుకుంటున్నారు. కొద్ది రోజుల కిందట దేముడుబాబు ఆ భూమిలో ముళ్లకంచె ఏర్పాటు చేసి మొక్కలు నాటాడు. దీంతో కళ్లాలకు వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని దాయాదులు గొడవపడ్డారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో దేముడుబాబుకు తన దాయాదుల కుటుంబానికి చెందిన కొరుపోలు చెల్లయ్యమ్మ (వరుసకు వదిన) కళ్లాల వద్ద కనబడడంతో వాగ్వాదం జరిగింది. దీంతో దేముడుబాబు తోసెయ్యడంతో చెల్లయ్య మ్మ కింద పడిపోయింది. విషయం తెలుసుకున్న  చెల్లయ్యమ్మ కుమారులు సన్యాసిరావు, అప్పలనాయుడు, మరో అన్నదమ్ముడు అప్పలనాయుడు, ఆయన భార్య సత్యవతి వచ్చి దేముడుబాబుపై పిడుగుద్దుల వర్షం కురిపించారు. వెంటనే సమీపంలో ఉన్న వారు విడిపించినప్పటికీ అప్పటికే దేముడుబాబు స్పృహ తప్పి పడిపోయాడు.

కొద్దిసేపటికి సంఘటనా స్థలానికి చేరుకున్న దేముడుబాబు భార్య లక్ష్మి, తదితరులు అత డ్ని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విష మించడంతో మెరుగైన వైద్యం కోసం ఎస్‌.కోట సీహెచ్‌సీకి తరలించగా.. అక్కడ చికిత్స పొందు తూ మృతి చెందాడు.  మృతుడి భార్య ఫిర్యాదు మేరకు  కొరుపోలు సన్యాసిరావు, అప్పలనాయుడు, చెల్లయ్యమ్మ, సత్యవతి, అప్పలనాయుడులపై ఎస్సై ప్రయోగమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు కోటి, కుమార్తె అనూష ఉన్నారు. ఇంటిపెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు.   

Advertisement
 
Advertisement