చట్ట వ్యతిరేక శక్తులపై ‘పీడీ’   

Pd Act On Anti Government Forces - Sakshi

నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌]

సీసీసీలో రెండు జిల్లాల నేర సమీక్ష సమావేశం

శ్రీరాంపూర్‌(మంచిర్యాల): చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చే యాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ అన్నారు. సోషల్‌ మీడియాలో అభ్యం తరకర పోస్టులు చేస్తూ శాంతిభధ్రతలకు విఘా తం కలిగించే వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పదేపదే చేస్తుంటే వారిపై రౌడీషీ ట్లు తెరువాలన్నారు.

బుధవారం సీసీసీలోని సింగరేణి గెస్ట్‌హస్‌ కాన్ఫరెన్సు హాల్‌లో పెద్దపల్లి, మం చిర్యాల జిల్లాల పరిధిలోని పోలీసు అధికారులతో క్రైం రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు అందుబాటులో ఉ న్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సూ చించారు. జనమైత్రి, పోలీస్‌మిత్ర వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ను మరింత పగడ్బందీగా నిర్వహించి బాలకార్మికులకు విముక్తి కల్పించాలన్నారు.

మ హిళలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రేవ్, నాన్‌గ్రేవ్‌ కేసుల పు రోగతిని అడిగి తెలుసుకున్నారు. పట్టణాల్లో, జా తీయ రహదారులపై ఏర్పడుతున్న ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించడానికి ఎస్‌హెచ్‌ఓలు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలను త గ్గించడానికి కృషి చేయాలన్నారు. పీడీఎస్‌ బి య్యం, నకిలీ విత్తనాలను అరికట్టడం కోసం టా స్క్‌ఫోర్స్‌ సిబ్బంది సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల సహాయం తీసుకొని దాడులు నిర్వహించాలన్నారు.

ఫర్టిలైజర్‌ దుకాణాలపై దాడులు నిర్వహించి నాసిరకం విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తున్న దుకాణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మావోయిస్టుల ప్రభావంపై అధి కారులతో ఆరా తీశారు. పోలీస్‌ అధికారులు 5ఎస్‌ పద్ధతిని స్టేషన్లలో తప్పక అవలంబించాలన్నారు. గత ఎన్నికల్లో జరిగిన లోపాలను వచ్చే ఎన్నికల్లో జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలింగ్‌లో భాగంగా పోలీసులు మరింత ప్రజల కు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు.

ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మెలగాలని సూచించారు. ఇటీవల పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ వచ్చిందని, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆయా స్టేషన్ల ప రిధిలో ఎస్సైలు శారీరక దారుఢ్యంలో శిక్షణ ఇవ్వాలన్నారు. జనమైత్రి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు.

సమావేశంలో పెద్దపల్లి, మంచి ర్యాల డీసీపీలు సుదర్శన్‌గౌడ్, ఎం.వేణుగోపాల్‌రావు, అడిషనల్‌ డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ రవికుమార్, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ ప్రవీణ్‌కుమార్, గోదా వరిఖని ఏసీపీ రక్షిత, ట్రైనీ ఐపీఎస్‌ శరత్‌చంద్ర, ఏసీపీలు గౌస్‌బాబా, రమేశ్‌బాబు, హబీబ్‌ఖాన్, సీతారాములు, బాలుజాదవ్, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ విజయసారథి, సీసీఎస్‌ ఏసీపీ చంద్రయ్య, రామగుండం ట్రాఫిక్‌ ఏసీపీ వెంకటరమణ, మంచిర్యా ల, శ్రీరాంపూర్‌ సీఐలు ప్రమోద్‌రావు, నారాయణనాయక్‌తో పాటు ఆయా సర్కిళ్ల సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top