breaking news
Vikram Duggal
-
సోషల్ మీడియాలో అభ్యంతరకమైన పోస్టులు చేస్తే రౌడీషీట్
శ్రీరాంపూర్(మంచిర్యాల): చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చే యాలని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. సోషల్ మీడియాలో అభ్యం తరకర పోస్టులు చేస్తూ శాంతిభధ్రతలకు విఘా తం కలిగించే వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పదేపదే చేస్తుంటే వారిపై రౌడీషీ ట్లు తెరువాలన్నారు. బుధవారం సీసీసీలోని సింగరేణి గెస్ట్‌హస్ కాన్ఫరెన్సు హాల్లో పెద్దపల్లి, మం చిర్యాల జిల్లాల పరిధిలోని పోలీసు అధికారులతో క్రైం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు అందుబాటులో ఉ న్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సూ చించారు. జనమైత్రి, పోలీస్‌మిత్ర వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌ను మరింత పగడ్బందీగా నిర్వహించి బాలకార్మికులకు విముక్తి కల్పించాలన్నారు. మ హిళలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసుల పు రోగతిని అడిగి తెలుసుకున్నారు. పట్టణాల్లో, జా తీయ రహదారులపై ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ఎస్హెచ్ఓలు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలను త గ్గించడానికి కృషి చేయాలన్నారు. పీడీఎస్ బి య్యం, నకిలీ విత్తనాలను అరికట్టడం కోసం టా స్క్‌ఫోర్స్ సిబ్బంది సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల సహాయం తీసుకొని దాడులు నిర్వహించాలన్నారు. ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు నిర్వహించి నాసిరకం విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తున్న దుకాణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మావోయిస్టుల ప్రభావంపై అధి కారులతో ఆరా తీశారు. పోలీస్ అధికారులు 5ఎస్ పద్ధతిని స్టేషన్లలో తప్పక అవలంబించాలన్నారు. గత ఎన్నికల్లో జరిగిన లోపాలను వచ్చే ఎన్నికల్లో జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలింగ్‌లో భాగంగా పోలీసులు మరింత ప్రజల కు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మెలగాలని సూచించారు. ఇటీవల పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందని, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆయా స్టేషన్ల ప రిధిలో ఎస్సైలు శారీరక దారుఢ్యంలో శిక్షణ ఇవ్వాలన్నారు. జనమైత్రి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. సమావేశంలో పెద్దపల్లి, మంచి ర్యాల డీసీపీలు సుదర్శన్‌గౌడ్, ఎం.వేణుగోపాల్‌రావు, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, ఏఆర్ అడిషనల్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, గోదా వరిఖని ఏసీపీ రక్షిత, ట్రైనీ ఐపీఎస్ శరత్చంద్ర, ఏసీపీలు గౌస్‌బాబా, రమేశ్‌బాబు, హబీబ్‌ఖాన్, సీతారాములు, బాలుజాదవ్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ విజయసారథి, సీసీఎస్ ఏసీపీ చంద్రయ్య, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ, మంచిర్యా ల, శ్రీరాంపూర్ సీఐలు ప్రమోద్‌రావు, నారాయణనాయక్‌తో పాటు ఆయా సర్కిళ్ల సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఎస్పీ బదిలీ
సాక్షి, నిజామాబాద్ : నాలుగు నెలల వ్యవధిలోనే జిల్లాకు మూడో ఎస్పీ రాబోతున్నారు. విక్రమ్ జిత్ దుగ్గల్ తర్వాత జిల్లా ఎస్పీగా వచ్చిన కేవీ మోహన్‌రావు ఆదివారం బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న తరుణ్జోషిని జిల్లా ఎస్పీగా నియమించింది. నాలుగు నెలల్లోపే.. మోహన్‌రావు ఈ ఏడాది జూలై 3న జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. రెండు రోజుల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్న తరుణంలో ఆయన జిల్లాకు వచ్చారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా విధులు నిర్వర్తించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూశారు. వినాయక చవితి ఉత్సవాలు, రంజాన్, దసరా, బక్రీద్ వంటి పండగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజావాణి, డయల్ యువర్ ఎస్పీ వంటి ప్రజా సంబంధ కార్యక్రమాలను కొనసాగించారు. గత నెలలో కొందరు కానిస్టేబుళ్లకు పదోన్నతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు పరిపాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించే తరుణంలోనే ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అనంతరం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. జిల్లావాసులు ఎంతో మంచివారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రజలు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మోహన్‌రావు 2004లో కామారెడ్డి డీఎస్పీగా పనిచేశారు. డాక్టర్.. పోలీసు జిల్లా ఎస్పీగా నియమితులైన తరుణ్ జోషి డెంటిస్టు. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈ యువ అధికారి ఎక్కువ కాలం తెలంగాణ జిల్లాల్లోనే పనిచేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొద్ది రోజులు విధులు నిర్వర్తిం చారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో అదన పు ఎస్పీగా, ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా పనిచేశారు. వరంగల్ జిల్లా ఓఎస్డీగా, విశాఖ పట్నం డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) గా విధులు నిర్వర్తించారు. 2010 ఆగస్టులో కడ ప జిల్లా ఎస్పీగా వెళ్లారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేశారు. ప్రస్తుతం సౌత్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం నిజామాబాద్ ఎస్పీగా బదిలీ చేసింది. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుం ది. రాజకీయ ఒత్తిళ్లు, నేతల మధ్య ఆధిపత్య పోరు ఉన్న జిల్లాలో ఆయన పనితీరు ఎలా ఉంటుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.