భర్త చనిపోయాడనే మనస్తాపంతో..  | Old Woman Committed Suicide | Sakshi
Sakshi News home page

భర్త చనిపోయాడనే మనస్తాపంతో.. 

May 9 2018 10:58 AM | Updated on May 9 2018 10:58 AM

Old Woman Committed Suicide - Sakshi

ఆత్మహత్య చేసుకున్న జానకమ్మ

లంగర్‌హౌస్‌ :  తన కంటే ముందే భర్త చనిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వృద్ధురాలు(80)  భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్పాలడిన సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై జగన్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో నివాస ముండే జానకమ్మ, వెంకటేశ్వర్లులు దంపతులు. వారి కుమారుడు సంవత్సరం క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి లంగర్‌హౌస్‌ బాపునగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

జానకమ్మ భర్త వెంకటేశ్వర్లు గత సంవత్సరం ఆగస్టులో అనారో గ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి జానకమ్మ లంగర్‌హౌస్‌లోని కుమారుని వద్దనే ఉంటుంది. భర్త బతికి ఉండగానే భార్య చనిపోవాలని, తన భర్తే మొదలు చనిపోయాడని జాన కమ్మ తీవ్ర మనస్తాపానికి గురై తాను ఇక బతకలేనంటూ అందరికి చెబుతూ బాధపడేది..

పొలం పనులు చూసుకోడానికి కుమారుడు రాంచందర్‌ పది రోజుల క్రితం ఒంగోలు వెళ్లాడు. కోడలు మంగళవారం ఉదయం సంగం దేవాలయానికి వెళ్లింది. ఇంట్లో ఎవరు లేని విషయం గమనించిన జానకమ్మ రెండ తస్తుల భవనంపైకెక్కి అక్కడ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement