మేము బంద్‌ చేస్తోంటే.. నువ్‌ పని చేస్తావా.. | Ola Cab Driver Beaten Up  For Working During Ongoing Strike in Mumbai | Sakshi
Sakshi News home page

బంద్‌ కొనసాగుతుండగా పని చేస్తావా అంటూ.. చితకొట్టారు

Oct 30 2018 2:40 PM | Updated on Oct 30 2018 2:48 PM

Ola Cab Driver Beaten Up  For Working During Ongoing Strike in Mumbai - Sakshi

దాడి దృశ్యం

బంద్‌ కొనసాగుతుండగా క్యాబ్‌ నడుపున్నవంటూ ఓలా సంస్థకు చెందిన ఓ డ్రైవర్‌ను సోమవారం చితకొట్టారు. దుర్భాషలాడుతూ అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు.

సాక్షి, ముంబై : పని వేళల్లో మార్పులు, ఆదాయంలో వాటా పెంపును కోరుతూ యాప్‌-బేస్డ్‌ క్యాబ్‌ డైవ్రర్లు ముంబయ్‌ వ్యాప్తంగా అక్టోబర్‌ 22 నుంచి నిర్వహిస్తున్నారు. ఎవరూ పనుల్లోకి పోకుండా నిరసన పాటిస్తున్నారు. అయితే, బంద్‌ కొనసాగుతుండగా క్యాబ్‌ నడుపున్నవంటూ ఓలా సంస్థకు చెందిన ఓ డ్రైవర్‌ను సోమవారం చితకొట్టారు. దుర్భాషలాడుతూ అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇప్పుడీ విడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా, డ్రైవర్‌పై దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

తమ ఆదాయాన్ని లాక్కుంటున్నారు..
ఓలా, ఊబర్‌ వంటి ఆన్‌లైన్‌ క్యాబ్‌ బుకింగ్‌ సంస్థలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ముంబయ్‌ వ్యాప్తంగా దాదాపు 40 వేల మంది యాప్‌-బేస్డ్‌ డ్రైవర్లు నిరసనలకు దిగడంతో దేశ వాణిజ్య రాజధానిలో 90 శాతం మేర క్యాబ్‌లు షెడ్లకే పరిమితమయ్యాయి. కాగా, డ్రైవర్లు సోమవారం తమ నిరసనలను ముమ్మరం చేశారు. కుర్లాలోని ఊబర్‌ కార్యాలయం నుంచి అంధేరిలోని ఓలా ఆఫీస్‌ వర​కు నల్ల జెండాలు ధరించి భారీ ర్యాలీ తీశారు. ఓలా, ఊబర్‌ సంస్థలు కుట్రకు పాల్పడుతున్నాయనీ, కావాలనే వినియోగదారుల వద్ద తక్కువ వసూలు చేసి తమకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement